కోల్‌కతా హత్యాచార ఘటన.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులతో పాటు ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ తీరుపై తీవ్రంగా మండిపడింది. అంత ఘోరం జరిగితే.. ఆమె ఆత్మహత్య చేసుకుందనిని ఎలా చెప్పారని మాజీ ప్రిన్సిపాల్‌ను నిలదీసింది. ఆయనను ఆ కాలేజీ నుంచి తొలగించి.. మరోచోట ప్రిన్సిపల్‌గా నియమించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కొన్ని మీడియాల్లో బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉదయాన్నే నేరాన్ని గుర్తించారు, కానీ ప్రిన్సిపల్‌ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది. అలాగే, ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైందని తూర్పారబట్టింది. అంత్యక్రియలకు మృతదేహాన్ని రాత్రి 8 గంటలకు అప్పగించిన 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? అని, ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.

‘వైద్య వృత్తుల్లో ఉండేవారు హింసకు గురవుతున్నారు… సమాజంలో పాతుకుపోయిన పురుషహంకార పక్షపాతం వల్ల మహిళా డాక్టర్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి, పని ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే.. ఈ రోజుల్లో చాలా మంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు.. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయస్థాయి ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరం’ అని ధర్మాసనం వెల్లడించింది. ఇందుకోసం జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

టాస్క్‌ఫోర్స్‌లో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇనిస్టి్ట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే సరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ మార్పుల విషయంలో మరో అత్యాచారం కోసం దేశం ఎదురుచూడబోదని వ్యాఖ్యానించింది.

About amaravatinews

Check Also

అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్‌.. ఆంటోనితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..

సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *