ఓ విధంగా జగన్ మంచి చేశారంటున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. రూ. 400 కోట్లు పెట్టీ జగన్ తన రాజకీయ సమాధి కట్టుకున్నారని.. ‘మనం నెగెటివ్’లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలని అభిప్రాయపడ్డారు. ఈ ప్యాలెస్ కట్టడం వలనే జగన్ పతనం ప్రారంభమైందని.. రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ అల్లరైనా.. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో రుషికొండలో భవనంపై ఆసక్తికర చర్చ జరిగింది. రుషికొండలో భవనంపై తాను హైకోర్టును ఆశ్రయించానని..తనపై సుప్రీం కోర్టుకు కూడా అబద్ధం చెప్పారన్నారు రఘురామ. …
Read More »Tag Archives: andhra pradesh
ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు
ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనున్నారు. ఈనెల 14 నుంచి 21 వరకు భువనేశ్వర్- కేఎస్‌ఆర్ బెంగుళూరు (18463), 15 నుంచి 22 వరకు కేఎస్‌ఆర్ బెంగళూరు- భువనేశ్వర్(18464) రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తామని అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు ఓ థర్డ్ ఏసీ బోగీని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు ఈ నెల 16న భువనేశ్వర్- తిరుపతి (22879), 17న తిరుపతి- భువనేశ్వర్ (22880) రైళ్లకు ఓ థర్డ్ ఏసీ అదనపు …
Read More »‘50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్’.. సీఎం సంచలన ఆరోపణలు
బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని (Karnataka) కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందని ఆయన ఆరోపించారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అంగీకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. తన సొంత మైసూరులో బుధవారం పర్యటించిన సీఎం సిద్ధరామయ్య.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసి సభలో పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా …
Read More »అందులో తప్పేముంది.. ఏపీలో సోషల్ మీడియా పోస్టుల కేసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేస్తున్నారంటూ జర్నలిస్టు విజయబాబు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగ్గా.. ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. చివరికి న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని …
Read More »అమరావతికి మహర్దశ.. కేంద్రం సమక్షంలో చర్చలు.. రూ.వేల కోట్లకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దశ తిరగబోతోంది. అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ (ADB) బ్యాంక్‌లు రుణం మంజూరు చేసేందుకు ఫైనల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖతో.. ఆంధ్రప్రదేశ్ అధికారులు, సీఆర్డీఏ జరుపుతున్న చర్చలు సఫలం అయ్యాయి. ఈ చర్చల్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయం చేయగా.. ఈ రుణానికి సంబంధించి ఎంవోయూ జరగలేదు. అయితే ఈ రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు విధించిన …
Read More »AP Weather: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాలలో భారీ వానలు.. బీ అలర్ట్
ఏపీవాసులకు అలర్ట్.. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని …
Read More »ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనకే అవకాశం.. చీఫ్ విప్ పదవి ఎవరికంటే, జనసేన నుంచి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. శాసనమండలి, శాసనసభల్లో చీఫ్ విప్‌ల పేర్లను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఎక్కువగా ఉండటంతో సమన్వయం కోసం ముందు అక్కడ విప్‌ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ఆ దిశగానే అక్కడ పదవుల భర్తీపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పేర్లు ఫైనల్ అయ్యాయని చెబుతున్నారు.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప అవే పేర్లు ఫైనల్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు …
Read More »టీడీపీకి షాకిచ్చిన మహిళా నేత.. చివరి నిమిషంలో ఇదేం ట్విస్ట్, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే!
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మరో కీలక మలుపు తిరిగింది. చివరి రోజు నాటకీయ పరిణామాలు జరిగాయి.. గడువులోగా మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మూడు సెట్లు దాఖలు చేశారు. చివరి రోజు మూడో సెట్ వేస్తూ బి-ఫారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. చివరి రోజు ఎస్.కోట మండలం బొడ్డవరకు చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి (రెండు సెట్లు).. అలాగే అదే మండలం వసికి చెందిన కారుకొండ వెంకటరావు …
Read More »ఏపీలో వారందరికీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు.. ఉత్తర్వులు జారీ
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలానికి వేతనాలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గతేడాది డిసెంబర్ 20 నుంచి 2024 జనవరి 10 జనవరి వరకూ.. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేశారు. కేజీబీవీలలో పనిచేసే వారితో పాటుగా జిల్లాలు, మండలాల్లోని సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు …
Read More »ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు అక్కడే ఫిక్స్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఆ జిల్లాకు మహర్దశ
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టులపై కసరత్తు జరుగుతోంది. కొత్తగా మరో ఏడు విమానాశ్రయాల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో భూముల్ని వెతికే పనిలో ఉన్నారు అధికారులు. అయితే నెల్లూరు జిల్లాలో విమానాశ్రయంపై ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.. దగదర్తిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దగదర్తి విమానాశ్రయ ప్రతిపాదనను పక్కన పెట్టగా.. కూటమి ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం పస్తుత ధరల ప్రకారం కొత్త డీపీఆర్‌లను సిద్ధం చేయాలని.. రెండు నెలల్లో టెండర్లు …
Read More »