ఏపీవాసులకు అలర్ట్.. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని …
Read More »Tag Archives: andhra pradesh
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనకే అవకాశం.. చీఫ్ విప్ పదవి ఎవరికంటే, జనసేన నుంచి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. శాసనమండలి, శాసనసభల్లో చీఫ్ విప్‌ల పేర్లను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి బలం ఎక్కువగా ఉండటంతో సమన్వయం కోసం ముందు అక్కడ విప్‌ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ఆ దిశగానే అక్కడ పదవుల భర్తీపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పేర్లు ఫైనల్ అయ్యాయని చెబుతున్నారు.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప అవే పేర్లు ఫైనల్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు …
Read More »టీడీపీకి షాకిచ్చిన మహిళా నేత.. చివరి నిమిషంలో ఇదేం ట్విస్ట్, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే!
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మరో కీలక మలుపు తిరిగింది. చివరి రోజు నాటకీయ పరిణామాలు జరిగాయి.. గడువులోగా మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మూడు సెట్లు దాఖలు చేశారు. చివరి రోజు మూడో సెట్ వేస్తూ బి-ఫారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. చివరి రోజు ఎస్.కోట మండలం బొడ్డవరకు చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి (రెండు సెట్లు).. అలాగే అదే మండలం వసికి చెందిన కారుకొండ వెంకటరావు …
Read More »ఏపీలో వారందరికీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు.. ఉత్తర్వులు జారీ
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలానికి వేతనాలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గతేడాది డిసెంబర్ 20 నుంచి 2024 జనవరి 10 జనవరి వరకూ.. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేశారు. కేజీబీవీలలో పనిచేసే వారితో పాటుగా జిల్లాలు, మండలాల్లోని సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు …
Read More »ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు అక్కడే ఫిక్స్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఆ జిల్లాకు మహర్దశ
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టులపై కసరత్తు జరుగుతోంది. కొత్తగా మరో ఏడు విమానాశ్రయాల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో భూముల్ని వెతికే పనిలో ఉన్నారు అధికారులు. అయితే నెల్లూరు జిల్లాలో విమానాశ్రయంపై ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.. దగదర్తిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దగదర్తి విమానాశ్రయ ప్రతిపాదనను పక్కన పెట్టగా.. కూటమి ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం పస్తుత ధరల ప్రకారం కొత్త డీపీఆర్‌లను సిద్ధం చేయాలని.. రెండు నెలల్లో టెండర్లు …
Read More »తెలంగాణ నుంచి మరో ఐఏఎస్‌కు ఏపీలో పోస్టింగ్.. కీలక బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చింది.. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి వచ్చిన రోనాల్డ్ రోస్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను ఆర్థికశాఖ కార్యదర్శి (బడ్జెట్ నిర్వహణ, ఇన్‌స్టిట్యూషనల్ ఫైనాన్స్)గా నియమించింది. అలాగే సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.కన్నబాబుకు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అలాగే ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బి.అనిల్‌కుమార్‌రెడ్డిని …
Read More »ఏపీలో భవన నిర్మాణాలకు కొత్త విధానం.. వివరాలివే
ఏపీలో కొత్తగా భవనాలు కట్టాలనుకునేవారికి ముఖ్య గమనిక. పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం నూతన విధానం తీసుకురానుంది. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తేనున్నట్లు చెప్పారు. నూతన విధానం ప్రకారం ఇక ముందు ఇంజనీర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల ప్లాన్ ప్రకారమే ఇల్లు, భవనాలు నిర్మించాల్సి ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో నారాయణ సమీక్ష జరిపారు. …
Read More »ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా కేబినెట్ ర్యాంక్‌తో కీలక పదవి దక్కింది. ఆయన్ను విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.. రెండేళ్ల పాటు ఈ పదవిలొ కొనసాగుతారు. అయితే చాగంటి ఈ పదవిని తీసుకుంటారా లేదా అనే చర్చ జరిగింది. ఎందుకంటే 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరోసారి పదవులు ఇచ్చినా ఆయన తిరస్కరించారు. తనకు ఈ పదవి దక్కడంపై చాగంటి …
Read More »AP Gas Cylinders: భీమవరంలో 35 గ్యాస్ సిలిండర్లు సీజ్.. ఆ పొరపాటు చేస్తే సిలిండర్లు పోయినట్టే..!
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీపావళి నుంచే దీపం 2.0 పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి దీనికి అనూహ్య స్పందన వస్తోంది. నియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం నమోదు చేసుకోవటంతో పాటుగా.. సిలిండర్ బుక్ చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనం పొందుతున్నారు. అయితే కొన్ని చిన్న, చిన్న పొరబాట్ల కారణంగా ఉచిత గ్యాస్ …
Read More »విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. బీచ్ రోడ్‌లో 24 అంతస్థుల భారీ స్కై స్క్రాపర్
విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్ కూడా అనే సంగతి తెలిసిందే. విశాఖ బీచ్, అరకు అందాలను చూడటానికి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వైజాగ్ వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి విశాఖ వస్తోన్న పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అనేక సదస్సులకు కూడా నగరం వేదికగా మారుతోంది. దీంతో విశాఖ నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరంలోని ఐకానిక్ తాజ్ గేట్ వే హోటల్‌ను కూల్చివేసి దాని స్థానంలో ఫైవ్ స్టార్ …
Read More »