విజయవడ నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరుగ ప్రయాణంలో విమానం రాత్రి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ విషయానికి వస్తే.. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి.. 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల …
Read More »Tag Archives: andhra pradesh
ఏపీకి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీపికబురు.. వారంలో డబ్బులొచ్చాయి, చంద్రబాబు రిక్వెస్ట్‌తో!
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది.. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 200.06 కి.మీ. పొడవైన 13 రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి సీఆర్‌ఐఎఫ్ (కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి) నుంచి రూ.400 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ స్వయంగా వెల్లడించారు. అలాగే గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో గుంటూరు శంకర్ విలాస్ ఆర్వోబీని నాలుగు వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు కూడా ట్వీట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా …
Read More »ఏపీలో యువతకు బంపరాఫర్.. టెన్త్ పాసైనా, ఫెయిలైనా ఫుడ్ పెట్టి ఉచితంగా.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు బంపరాఫర్ ప్రకటించింది. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో.. బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైర్డ్ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. యువకుల కోసం ఎయిర్ కండిషనర్, కూలర్, రిఫ్రిజిరేటర్ మెకానిజమ్‌పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని రాజీవ్‌నగర్‌లోని భారత వికాస్ పరిషత్ భవనంలో అతి త్వరలో ఈ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. పదో …
Read More »రూ.9.6కోట్లతో 480 మద్యం షాపులకు దరఖాస్తు.. లాటరీలో ఎన్ని వచ్చాయో తెలుసా!
ఏపీ మద్యం షాపుల లాటరీలో చిత్ర, విచిత్రాలు జరిగాయి.. కొంతమంది అత్యాశతో ఎక్కువ షాపులకు లాటరీ వేస్తే దరిద్రం వెంటాడింది. కొందరు 100 సంఖ్యలో దరఖాస్తులు వేస్తే.. ఒక్క షాపు కూడా రాని పరిస్థితి. కొందరు సరదాగా దరఖాస్తులు వేయగా.. వారికి షాపులు దక్కడం విశేషం. విజయవాడకు చెందిన ఓ బార్ యజమాని.. తన టీమ్‌తో కలిసి ఏకంగా 480 దరఖాస్తులు వేయగా 11 షాపులు మాత్రమే వచ్చాయి. విజయవాడకు చెందిన మరో మద్యం వ్యాపారి 360 దరఖాస్తులు వేయగా 5 షాపులు దక్కాయి. …
Read More »ఏపీలో బీజేపీ నేతకు 5 మద్యం షాపులు.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులకు 25 షాపులు, పాపం మంత్రి నారాయణ!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల లాటరీలో చిత్ర విచిత్రాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, వారి అనుచరులకు భారీగా షాపులు దక్కాయి. అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ఏకంగా 5 షాపులు దక్కడం విశేషం. ఆయనకు ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బల్లో 5 మద్యం షాపులు దక్కాయి. మంత్రి నారాయణ.. మొన్నటి ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల కోసం నెల్లూరు జిల్లాలో తన సొంత డబ్బులు రూ.2 కోట్లతో మద్యం షాపులకు …
Read More »ఏపీకి కేంద్రం డబుల్ ధమాకా.. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి మహర్దశ, ఈసారి భారీగా
ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా.. మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదలయ్యాయి. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988.773 కోట్లు విడుదల చేయగా.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఈ నిధుల్ని ఇచ్చారు. వీటిలో అన్‌టైడ్ గ్రాంట్స్ కింద రూ.395.5091 కోట్లు ఇవ్వగా.. టైడ్‌గ్రాంట్స్ కింద రూ.593.2639 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం 9 జడ్పీలు, 615 మండల పంచాయతీలు, రూ.12,853 గ్రామపంచాయతీలకు దక్కుతాయి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 29 …
Read More »ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వీలైనంత వరకుప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలన్నారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి …
Read More »పండుగ రోజున చంద్రబాబు ఇంటికి చిరంజీవి.. అసలు కారణమదే..
మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి శనివారం సాయంత్రం వచ్చారు చిరంజీవి. చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం తాలూకు చెక్ అందజేశారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని శనివారం రోజున చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. ఇక …
Read More »ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లోనే.. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక. ఏపీలో ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 14వ తేదీ (సోమవారం) నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, …
Read More »దసరా పండుగ రోజు ఏపీకి కేంద్రం సూపర్ న్యూస్.. మరోసారి నిధుల విడుదల.. ఈసారి ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం కింద తొలి విడతగా ఏపీకి రూ.593.26 కోట్లు నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఈ నిధులు కేటాయిస్తారు. మరోవైపు ఇటీవలే కేంద్రం గోదావరి పుష్కరాలకు సైతం నిధులు విడుదల చేసింది. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద తూర్పుగోదావరి జిల్లాలో పుష్కర పనుల కోసం రూ.100 కోట్లు విడుదల చేశారు.2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అప్పటిలోగా ఈ నిధుల …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal