Tag Archives: andhra pradesh

ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా విద్యార్ధి బ్యాగ్‌.. ఏముందాని చెక్‌ చేయగా షాకింగ్ సీన్

ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఇంజనీరింగ్‌ విద్యార్ధి ఎయిర్‌ పోర్టులో అనుమానా స్పదంగా కనిపించాడు. అతడి లగేజీ చెక్‌ చేయగా.. రెండు బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ ఘటన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసింది. వెంటే సిబ్బంది సదరు విద్యార్ధిని అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. గన్నవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని పానిపట్‌కు చెందిన ఆర్య యువకుడు గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వస్థలం నుంచి గత జులై నెలలో యూనివర్సిటీకి …

Read More »

గ్రామ సమస్యలు తీర్చిన మహిళా సర్పంచ్‌కే పెద్ద కష్టం.. ఏకంగా ఇంట్లో నుంచి గెంటేసిన కుటుంబ సభ్యులు!

రోడ్డున పడ్డారు ఓ మహిళా సర్పంచ్. ఆమె గ్రామానికి ప్రధమ పౌరురాలు… గ్రామంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే ఆ మహిళా సర్పంచ్.. అయితేనేం.. ఓ మహిళగా సొంత కుటుంబ సభ్యుల నుంచి సమస్య ఎదురయింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళా సర్పంచ్‌ను.. భర్త తరపు కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానుష ఘటన శ్రీసత్య సాయి జిల్లాలో వెలుగు చూసింది. లేపాక్షి మండలం సిరివరం సర్పంచ్ నేత్రావతిని భర్త తరపు కుటుంబ సభ్యులే ఇంట్లో నుంచి …

Read More »

వామ్మో.. కొత్త రకం సైబర్ నేరాల లిస్ట్ ఇది.. అలెర్ట్‌గా లేరంటే అంతే సంగతులు

రోజుకో కొత్త రకం నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకరకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేసేస్తున్నారు. ఈ విషయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో బాగా చదవుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల బుట్టలో పడి లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి నిత్యం వార్తా కథనాలను మనం చూస్తూనే ఉన్నాం.. ట్రాయ్‌తో పాటు పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆన్‌లైన్ వేదికగా పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతోంది.  మరి ప్రస్తుతం ట్రెండింగ్‌లో …

Read More »

పుష్ప 2 సినిమాకి.. తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధం ఏంటి?

పుష్ప అంటే వైల్డ్‌ ఫైర్‌ కావచ్చు.. కానీ అందుకు కారణం.. గంగమ్మ జాతర! పుష్ప రైజ్ నుంచి రూల్ వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ వందల ఏళ్లకు ముందే.. దుష్టుల పాలిట ఊచకోతకు సంకేతం గంగమ్మ జాతర..! తాజాగా ఐకాన్ స్టార్‌ తాజా గెటప్‌తో.. వాల్డ్‌ ఫేమస్‌ అయింది తిరుపతి గంగమ్మ జాతర! అవును..పుష్ప- 2 స్టోరీ లైన్‌ ఏదైనా కానివ్వండి..! కానీ సినిమాను ఊపేసింది మాత్రం..గంగమ్మ జాతర సన్నివేశాలు! మాతంగి వస్త్రధారణలో 20 నిమిషాలపాటు థియేటర్లలో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్‌! శక్తి …

Read More »

వడ్డీ రేట్లు యధాతథం.. రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయని ఆర్​బీఐ, రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి.దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా …

Read More »

పెన్షన్ ఇస్తామని నమ్మించారు.. చివరికి వృద్ధులను ఇలా చేశారు..!

అన్‌నోన్‌ కాల్‌ ఎత్తారో అడ్డంగా బుక్కైపోతారు. అవతలివారి మాటలు నమ్మారో నిండా మునిగిపోతారు. మాటలతో బెదిరిస్తారు సైబర్‌ బూచోళ్లు. ఎకౌంట్లో క్యాష్‌ పడేదాకా టార్చర్‌ పెడతారు. చదువుకున్నోళ్లు, ఉద్యోగులు కూడా మోసగాళ్ల బారినపడుతున్నారు. కొత్త టెక్నిక్స్‌తో జనాన్ని ట్రాప్‌ చేస్తున్నారు.. మోసాల్లో ముదిరిపోయిన సైబర్‌ క్రిమినల్స్‌. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త నేరంతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా వృద్ధులకు వచ్చే పెన్షన్లను సైతం కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా చాలామంది వృద్ధులు అనవసర లింకులను క్లిక్ చేసి తమ ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకున్నారు. పెన్షన్ …

Read More »

ఏపీలో రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతుల దగ్గరి నుంచి పంట కొనుగోలు చేసిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించడంలో జాప్యం కావద్దని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏ రైతు అయినా ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో …

Read More »

ఏపీలో ప్రజలకు భారీ ఊరట?.. విద్యుత్ ఛార్జీలపై కీలక అప్డేట్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కేలా ఉంది. రాష్ట్ర విద్యుత్‌ వినియోగదారులపై ఛార్జీల మోత లేకుండా.. 2025-26కి డిస్కంలు వార్షికాదాయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందజేశాయి. ఈ నివేదికలో విద్యుత్‌ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు.. ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. నివేదికలో విద్యుత్‌ కొనుగోళ్లు.. విక్రయాలకు మధ్య వ్యత్యాసం రూ. 14,683.24 కోట్లుగా పేర్కొన్నారు. కొనుగోళ్లు, నిర్వహణకు రూ. 58,868.52 కోట్లు అవసరమని.. విద్యుత్‌ విక్రయాల ద్వారా రూ. 44,185.28 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి …

Read More »

ఏపీ మద్యం షాపుల దగ్గర బ్యానర్లు ఏర్పాటు.. రూ.5 లక్షల ఎఫెక్ట్, ఆసక్తికర కారణం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అక్టోబర్ నెల నుంచి అమల్లోకి వచ్చింది. లాటరీ ద్వారా కేటాయించిన షాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మద్యం ధరల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ప్రస్తుతం ప్రతి వైన్ షాప్ వద్ద ధరల పట్టికలు కనిపిస్తున్నాయి. అలాగే.. MRP ధరలకే మద్యం అమ్మబడును.. అని కూడా బ్యానర్లు కడుతున్నారు. మద్యం బ్రాండ్, ఎంత ఎంఎల్ ఎంత ధరకు లభిస్తుంది వంటి వివరాలతో బ్యానర్లు పెడుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి వైన్ షాప్ …

Read More »

బాబోయ్ మళ్లీనా.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! ఈ ప్రాంతాల్లో జోరు వానలు

దక్షిణాదిన దడ పుట్టించిన ఫెంగల్‌ తుపాన్‌ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్‌ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వానలు మళ్లీ రావులే అని జనాలు సంబరపడ్డారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావారణ శాఖ వెల్లడించింది. ఈ మేరక శుక్రవారం వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో …

Read More »