Tag Archives: andhra pradesh

తిరుమలలో డిక్లరేషన్‌పై పవన్ కళ్యాణ్ సంతకం.. కూతురి కోసం, టీటీడీ నిబంధనలు పాటిస్తూ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టారు. పవన్ చిన్న కుమార్తె పొలెనా కొణిదెల కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే పొలెనా తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.

Read More »

ఏపీలో వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్.. ఇకపై ఆ మొత్తం కట్, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమంటూ కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఉచితంగా న్యూస్‌పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం అదనంగా రూ.200 అలవెన్సు ప్రకటించారు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‌ ఈ అదనపు …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం ఊరట.. జనవరి నుంచి పక్కా, కీలక ప్రకటన

ఏపీలో రేషన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం రాయితీపై నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. తెల్లకార్డులు ఉన్నవారికి రాయితీపై 16 నెలల తర్వాత.. దసరా సందర్భంగా కందిపప్పు, పంచదార పంపిణీ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం రూ.67కు కిలో కందిపప్పు, రూ.17కు అరకిలో పంచదార పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. అంతేకాదు మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రేషన్‌ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, పంచదార అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల …

Read More »

ఏపీలో రైతులకు 48 గంటల్లో అకౌంట్‌లలో డబ్బులు జమ.. ఎంత ఇవ్వాలో కూడా ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం సేకరణకు సిద్ధమైంది. ఈ నెల మొదటివారంలో ధాన్యం అమ్మకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు.. 48 గంటల్లోనే వారి బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసేందుకు అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకునే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాలు, ఇతర సంక్షేమ పథకాలకు 45 లక్షల టన్నుల ధాన్యం అవసరమని అంచనాలు వేశారు.. ఈ ఖరీఫ్‌లో 37 లక్షల …

Read More »

బలవంతపెట్టిన ఫ్యామిలీ.. కాదనలేకపోయిన సీఎం.. కర్నూలులో ఇంట్రెస్టింగ్ సీన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలసిందే. ఆహారం, ఆరోగ్యం విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ రూల్స్ పాటిస్తారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రిగా సమీక్షలు, సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలోనూ.. ఆయన టైమ్‌కు ఆహారం తీసుకుంటూ ఉంటారు. రాత్రి ఏడున్నరలోపే డిన్నర్ పూర్తి చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం, టైమ్ తప్పకుండా భోజనం.. ఇలా అన్నీ టైమ్ ప్రకారం …

Read More »

దసరాకు ఊరెళుతున్నారా.. ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి మొదలవుతోంది.. ఈ నెల 2 నుంచి విద్యా సంస్థలకు దసరా సెలవులు మొదలుకాబోతున్నాయి. అయితే దసరా పండుగకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ఈ క్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దసరాకు సొంతూళ్లకు వచ్చి వెళ్లే వారి కోసం అదనంగా 6,100 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది ఆర్టీసీ. ఈ బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చేవాళ్ల కోసం.. రాష్ట్రంలో ఓ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వారి రద్దీని దృష్టిలో ఉంచుకొని …

Read More »

ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి డబ్బులు జమ చేస్తాం.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 4 (శుక్రవారం) నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని.. వరదల వల్ల నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదు అన్నారు. వరద సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు.. ప్రభుత్వం డబ్బులు …

Read More »

ఏపీలో వాళ్ల అకౌంట్‌లలోకి రూ.10వేలు.. జగన్ సర్కార్ పథకం కొనసాగింపు..పేరు మార్పు, కొత్త పేరిదే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పలు పథకాలకు పేర్లు మార్చారు. తాజాగా మరో పథకానికి ప్రభుత్వం పేరు మార్చింది. గత ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరు మార్చేసింది. జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. …

Read More »

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కన్సల్టేటివ్‌ ఫోరం ఏర్పాటు, ఛైర్మన్‌గా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్‌ ఫోరం (సంప్రదింపుల కమిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విజయవాడలో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన సదరన్‌ రీజినల్‌ కౌన్సిల్‌ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కన్సల్టేటివ్‌ ఫోరాన్ని ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఈ మేరకు ఈ అంశంపై …

Read More »

డిగ్రీ, పీజీ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పనిసరి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల బోధనా రుసుముల చెల్లింపుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బోధన రుసుముల చెల్లింపు కోసం విద్యార్థి హాజరు శాతం కచ్చితంగా 75 శాతం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులు కాలేజీలకు రాకపోయినా కూడా 75 శాతం అటెండెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోధన రుసుముల చెల్లింపుల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై …

Read More »