Tag Archives: andhra pradesh

 ఏపీ మంత్రి స్వామికి గాయాలు.. ఎద్దులు ఎంత పనిచేశాయి

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ కొలుపులు (తిరుణాళ్లు) నిర్వహించారు.. మంత్రి, టీడీపీ నేతలు ఈ వేడుకకు హాజరుకాగా.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నేతలు, మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇంతలో ఒక్కసారిగా ఎద్దులు బెదిరి మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. ఈ ఘటనలో మంత్రి స్వామి ముందుకు బోర్లా పడిపోగా.. ఆయన్ను ఎద్దు ముందుకాళ్లతో బలంగా తొక్కింది. వెంటనే …

Read More »

 ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. 

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజులు ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా.. ఈసారి కూడా వారే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా తెలియజేశారు. అస్వస్థతతో ఉన్న వారు, ఇంకా పంపిణీ మిగిలితే 2న ఇస్తారు. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు …

Read More »

ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు ట్రైన్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోనూ మూడో ట్రైన్ లైను పనుల కారణంగా ప్రయాణికులకు ట్రైన్ సేవల్లోనూ అంతరాయం …

Read More »

పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన.. 

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంపై లోక్‌సభలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్‌ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. గత మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై ప్రశ్నించారు. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనుల అంశంపై క్లారిటీ ఇచ్చారు. 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్‌ లెవెల్‌ వరకు నీటిని నిల్వ …

Read More »

 ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 26, 2024): మేష రాశి వారికి మీ దగ్గర బంధువుల నుంచి రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) పిల్లల చదువుల మీద …

Read More »

అసెంబ్లీలో వారందరినీ నిలబెట్టిన సీఎం..

ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. సీరియస్‌గా మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలతో సభలో నవ్వులు విరిశాయి. అంతేకాదు సభలోని మెజారిటీ సభ్యులు లేచి నిల్చోవాల్సి వచ్చింది. చంద్రబాబు మాటతో వారంతా లేచి నిల్చోవాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఇలా జరిగిందనే సంగతికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అనే అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని ఆరోపించారు. …

Read More »

ఏపీలో మందుబాబులకు శుభవార్త..

ఏపీలో మందబాబులకు అలర్ట్.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేశారు.. కీలక అంశాలను ప్రస్తావించారు. మద్యం విధానం స్థానంలో కొత్త మద్యం, బార్ల విధానాన్ని తీసుకొస్తామని.. నిపుణుల కమిటీ లేదా కేబినెట్ సబ్ కమిటీతో మద్యం విధానంపై అధ్యయనం చేయిస్తామన్నారు. ఈ ఎక్సైజ్ పాలసీని అత్యుత్తమ ఆచరణలతో ఉండేలా దీన్ని రూపొందిస్తామని.. మద్యం ధరల్ని సమీక్షించి, పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలా చూస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో …

Read More »

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. 

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని జేఈవో (విద్య, ఆరోగ్యం) గౌతమి చెప్పారు. తిరుమలలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని, కాళీ గాజు బాటిళ్లు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు, తిరుమలలోని దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకే రేటుతో వాటర్ బాటిళ్లు …

Read More »

వైఎస్ జగన్‌కు ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో….?

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు. వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్న నాగబాబు.. పాత పగల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు …

Read More »

ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో రెండు రోజులు ఇంతే.. 

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శనివారం, ఆదివారం అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని.. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా …

Read More »