ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు ట్రైన్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్‌-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని దౌండ్‌ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోనూ మూడో ట్రైన్ లైను పనుల కారణంగా ప్రయాణికులకు ట్రైన్ సేవల్లోనూ అంతరాయం కలగనుందని చెప్పారు. రద్దయిన ట్రైన్ల వివరాలు అధికారులు వెల్లడించారు.

  • సికింద్రాబాద్‌-ముంబయి మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్‌ ( ట్రైన్ నెంబర్ 12220) ఈ నెల 30న, ముంబయి-సికింద్రాబాద్‌ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ (12219) 31న క్యాన్సిల్ చేశారు.
  • పుణె-సికింద్రాబాద్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ( నెంబర్ 12205) జులై 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో రద్దు చేశారు. సికింద్రాబాద్‌-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ (12206) జులై 29, 31 తేదీల్లో రద్దు చేశారు.
  • నిజామాబాద్‌-పుణె మధ్య తిరిగే (11410) ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను ఈనెల 31న రద్దు చేశారు.
  • సికింద్రాబాద్‌-విజయవాడ ( ట్రైన్ నెంబర్ 12714), విజయవాడ-సికింద్రాబాద్‌ ( ట్రైన్ నెంబర్ 12713) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను.. గుంటూరు-సికింద్రాబాద్‌ ( ట్రైన్ నెంబర్ 17201), సికింద్రాబాద్‌-గుంటూరు ( ట్రైన్ నెంబర్ 17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు ఆగస్టు 5 నుంచి 10 వరకు క్యాన్సిల్ అయ్యాయి.
  • డోర్నకల్‌-విజయవాడ ( ట్రైన్ నెంబర్ 07755), విజయవాడ-డోర్నకల్‌ ( ట్రైన్ నెంబర్ 07756), విజయవాడ-భద్రాచలం రోడ్‌ ( ట్రైన్ నెబంర్ 07979), భద్రాచలంరోడ్‌-విజయవాడ ( ట్రైన్ నెంబర్ 07278) ట్రైన్లు ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేస్తు్న్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నెంబర్ 18046)తో పాటు సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి, సికింద్రాబాద్‌-గూడూరు మధ్య తిరిగే సింహపురి, ఆదిలాబాద్‌-తిరుపతి మధ్య తిరిగే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు ట్రైన్లను దారి మళ్లించి నడిపించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

About amaravatinews

Check Also

దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు.. YCP ఎంపీ కొత్త డిమాండ్..!

పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి తెరమీదకు తీసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *