శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీశైలం ఆలయ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి.. ఇందుకోసం పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, జనార్ధన్, కందుల దుర్గేష్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే శ్రీశైలం అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలతో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు కూడా …
Read More »Tag Archives: chadnra babu naidu
ఏపీలో పింఛన్లపై మరో తీపికబురు.. వాళ్లందరికి ఊరట, ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు పింఛన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. అనర్హులపై మాత్రం వేటు తప్పదని చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పింఛన్లపైనా నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు …
Read More »ఏపీ పోలీసులకు శుభవార్త.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులక తీపికబురు చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని.. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను అభినందిస్తున్నానని.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీలేదు అన్నారు. పోలీసులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారన్నారు. పోలీసుల …
Read More »