Tag Archives: chandra babu naidu

పోస్టాఫీసుల్లో ఖాతాల కోసం జాతర.. క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఏంటో తెలుసా?

తపాలా శాఖ పోస్టాఫీస్ లు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. పొదుపు ఖాతాల కోసం, ఆధార్ అనుసంధానం కోసం మహిళలతో పోటెత్తుతున్నాయి. సంక్షేమ ఫలాలు అందాలంటే తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉండాలన్న ప్రచారంతో తిరుపతి పోస్టాఫీస్ మరో జాతరను తలపిస్తోంది. పోస్టాఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేసుకోవాలన్న సూచన ఇప్పుడు మహిళల లబ్ధిదారుల్లో ఆందోళన కు కారణమైంది. రాష్ట్రమంతా పొస్టాఫీసులకు మహిళలు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో అకౌంట్ లేనివారే తెరవాలన్నా సూచన దుష్ప్రచారంగా మారింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకునే …

Read More »

తుఫాన్ ముప్పు బాబోయ్.! ఏపీకి వచ్చే 3 రోజులు కుండబోత.. ఈ జిల్లాలకు అలెర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 29 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 10 .6 ° తూర్పు రేఖాంశం 82.6 °వద్ద అదే ప్రాంతములో కేంద్రీకృతమై ఉంది. ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి ఉత్తర ఈశాన్యముగా 270 కి.మీ, నాగపట్టణానికి తూర్పుగా 300 కి.మీ., పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల …

Read More »

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ బస్సు సర్వీసులలో టికెట్ చార్జీలు తగ్గింపు..! 

ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవోలకు అప్పగించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ ఆయా జిల్లాల డీపీటీవోలు ఆదేశాలు జారీ చేస్తున్నారు.చలి పంజా విసురుతుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఆ ప్రభావం ఏపీఎస్ఆర్టీసీపై పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రాత్రివేళ్లలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతుండడంతో, బస్సు ప్రయాణికులపై ఆ ఎఫెక్ట్ చూపుతుంది. చలికి గజగజ వణికిపోతోన్న ప్రయాణికులు ఇప్పుడు ఏపీ బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. దీంతో పలు రూట్లలో …

Read More »

Vande Bharat: ఏపీకి మరో వందే భారత్‌.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ!

సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ వందే భారత్‌లో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీతో కూడిన రైలు. ఈ రైలుకు ఇతర రైళ్లకంటే టికెట్‌ ధర ఎక్కువ ఉన్నప్పటికీ డిమాండ్‌ మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.. భారత రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణించే రైల్వేలో హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ …

Read More »

నిర్మానుష్య ప్రదేశంలోకి డ్రోన్ పంపిన పోలీసులు.. చెట్ల పోదల మాటున చిక్కారుగా

బ్లేడ్‌ బ్యాచ్‌..గంజాయి గ్యాంగ్‌.. తాగుబోతులు ముఠా.. ఇలా ఎవరైనా సరే.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఓవరాక్షన్ చేస్తే కుదరదు. పోలీసులు.. డ్రోన్లతో మీ వైపు దూసుకువస్తున్నారు. అక్కడ తప్పించుకున్నా.. విజువల్స్ సాయంతో మిమ్మల్ని పసిగట్టి ఇంటికి వచ్చి మరీ తోలు తీస్తారు. డ్రోన్లతో తాగుబోతులకు, పేకాట రాయుళ్లకు దడ పుట్టిస్తున్నారు పోలీసులు. బహిరంగంగా లిక్కర్‌ లాగిస్తున్న వారిని హడలెత్తిస్తున్నారు. పేకాట దందాలకు చెక్ పెడుతున్నారు. అనంతపురం శివారు ప్రాంతాల్లో ఆకతాయుల ఆట కట్టించేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు పోలీసులు.పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో తాగేస్తున్న మందుబాబులకు దడ …

Read More »

చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పం.. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన అనంతరం ఏపీలోని చంద్రబాబు సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే ధ్యేయంగా.. పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు వ్యూహంతో ముందుకెళ్తున్నారు.. నక్కపల్లి మండలంలోని విశాఖ-చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో (వీసీఐసీ) పరిశ్రమల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.. ఈ క్రమంలోనే నక్కపల్లి మెడలో స్టీల్ నగ చేరబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్‌ సెల్లార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ …

Read More »

ఇక అమరావతే శాశ్వతం.. చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్.. డైరెక్ట్ గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు..

ఇకపై రాజధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో ఇకపై ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాజధానిపై కేంద్రం నుంచి గెజిట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్దమైన …

Read More »

YS Jagan: చంద్రబాబు, బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఎవరిపై అయినా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని ఆరోపించారు. అందరి కుటుంబాలలో మాదిరిగానే తమ కుటుంబంలోనూ విబేధాలు ఉన్నాయన్న వైఎస్ జగన్.. తల్లీ, …

Read More »

కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట.. ఆ పనులు వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌‌లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు తెలిపారు. ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవు అన్నారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ …

Read More »

TATA Group: ఏపీకి టాటా గ్రూప్ బంపరాఫర్.. టీసీఎస్‌ మాత్రమే కాదు అంతకు మించి..!

Tata Companies Chairman Chandrasekaran meets CM Nara Chandrababu naidu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో టీసీఎస్ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌, ఇవాళ (సోమవారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు. దివంగత రతన్ టాటా తన దార్శనిక నాయకత్వం, …

Read More »