Tag Archives: high court

హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్.. N కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని ఆదేశం

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయగా.. ఇది అక్రమం అంటూ యజమాని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతలపై స్టే విధించింది. కాగా, హీరో నాగార్జున మాదాపూర్‌లోని తూంకుంట ఒడ్డున 2015లో ఈ …

Read More »

రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం స్పందించాలని విజ్ఞప్తి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.. ఎప్పుడూ తన సొంత పార్టీపైనే విమర్శలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ సిటిజన్‌షిప్ గురించి చెప్పాలని.. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన …

Read More »

బాధితురాలిని హత్యాచారం చేసిన చోటును ఫోటోలతో సహా చూపించండి.. హైకోర్టు ఆదేశాలు

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఈ నెల 8 వ తేదీన జరిగిన రేప్, మర్డర్‌ ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. ఇక ఈ హత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలో మొదలైన ఆందోళనలు, నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం అర్ధరాత్రి ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ …

Read More »

ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్‌ జగన్‌ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. …

Read More »