దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రికి వస్తున్నారా అయితే ఇకపై కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే. ఆలయానికి వచ్చే స్త్రీలైనా, పురుషులైన ఈ నిబంధనలు పాటించకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే వారికి ఎంట్రీ ఉండదని.. వచ్చిన దారిలోనే వారు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇంతకు ఏంటీ కొత్త నిబంధనలు తెలుసుకుందాం పదండి. ఇంద్రకీలాద్రి తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ మధ్యకాలంలో చాలామంది ఆలయానికి వచ్చేటప్పుడు, ఆలయంలో ఉన్నప్పుడూ ఎలా ఉండాలి, ఎలా రావాలి అనేది పూర్తిగా మరిచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. …
Read More »Tag Archives: Indrakeeladri
నో మొబైల్.. డ్రెస్ కోడ్ ఉంటేనే అమ్మవారి దర్శనం.. తిరుమల తరహాలో కఠిన నిబంధనలు
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న కనకదుర్గమ్మను దర్శించాలంటే ఇక డ్రెస్ కోడ్ పాటించాల్సిందే.. మహిళలైనా, పురుషులైనా సరే నిబంధనలు తప్పనిసరి అంటున్నారు ఆలయ అధికారులు..తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలకు చీర, చున్నీతో కూడిన సల్వార్ కమీజ్, పురుషులైతే ధోతీ లేదా పైజామా, చొక్కా ధరించాలని పేర్కొంటున్నారు. తిరుపతి తర్వాత రెండో అతి పెద్ద ఆలయంగా ప్రశస్తి పొందిన ఇంద్రకీలాద్రిపై తిరుపతి తరహాలోనే అభివృద్ధి జరగాలని గత కొన్నేళ్లుగా అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన శీనా నాయక్ …
Read More »