ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పలు పథకాలకు పేర్లు మార్చారు. తాజాగా మరో పథకానికి ప్రభుత్వం పేరు మార్చింది. గత ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరు మార్చేసింది. జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More »