అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. మరోవైపు …
Read More »Tag Archives: jogi ramesh
మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్.. మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు, చిక్కులు తప్పవా!
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇబ్రహీపంట్నలోని రమేష్ నివాసంలో 15మంది అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.. ఈ క్రమంలోనే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. అగ్రిగోల్డ్‌కు సంబంధించి సీఐడీ స్వాధీనంలో ఉన్న రూ.5కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీ రంగంలోకి దిగి ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో అగ్రిగోల్డ్‌కు చెందిన భూమి …
Read More »