సీఎం చంద్రబాబు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వర్క్ షాప్ నకు …
Read More »Tag Archives: nara lokesh
దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..
మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు. రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది. దీంతో మరోసారి తన భూమిని విక్రయించుకునేందుకు …
Read More »ఆయనతో భేటీ నా జీవితంలో కీలక మలుపు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కీలక మలుపులు ఉంటాయి. అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశం తన జీవితంలోనూ కీలక మలుపుల్లో ఒకటిగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లొకేష్ తెలిపారు. ఆయనతో జరిగిన సమావేశం మాటలతో వర్ణించలేనిదని లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కేంద్రమంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ప్రధానితో సమావేశమైన భేటీని ఆయన గుర్తుచేసుకున్నారు.ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బీజీబీజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ రాష్ట్రానికి సంబంధించిన …
Read More »టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష
బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ …
Read More »ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేష్ కీలక భేటి.. ఎందుకంటే.?
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. …
Read More »చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సర్వీసులు
ప్రజల వద్దకే పాలన అన్నట్లు… దేశంలోనే ఫస్ట్ టైమ్ వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల సేవలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను ప్రారంభించారు మంత్రి లోకేష్.దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. 9552300009 నెంబర్‌కి మెసేజ్ చేస్తే చాలు.. 161 రకాల ప్రజలు సేవలు పొందొచ్చు. టీటీడీ సహా దేవాలయ టికెట్లు, APSRTC, అన్న క్యాంటీన్, …
Read More »మనసంతా విశాఖపైనే.. చంద్రబాబు సర్కార్ ఫుల్ పోకస్.. మూడు దశల్లో రూ.84,700 కోట్లు..
స్టీల్ సిటీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇంకోవైపు మనసంతా విశాఖే అని చాటుకుంటోంది. ప్రకృతి సోయగాలకు నిలయమైన సుందర నగరాన్ని.. అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తోంది.మొన్న టీసీఎస్.. నిన్న గూగుల్‌తో ఎంవోయూ.. ఇంకోవైపు పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు. హెచ్‌పీసీఎల్, ఎన్టీపీసీ హైడ్రో పవర్ లాంటి వాటిలో లక్షల కోట్ల పెట్టుబడులు. వీటితో పాటు టూరిజం, ఫార్మా అన్ని రకాలుగా విశాఖకు పెద్దపీట వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. …
Read More »ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు.. ప్రతి రోజూ కాలేజీల్లో ఉచితంగా, మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ ప్రకటన చేశారు.ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్లు విజయరామరాజు, కృతికాశుక్లా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో …
Read More »ఆపదొస్తే, ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా.. పెద్ద తప్పు చేశావు తమ్ముడు: మంత్రి లోకేష్ ఎమోషనల్
టీడీపీ కార్యకర్త, తనకు అభిమాని శ్రీను మృతిపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను.. తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి, తనకు తీరని లోటు మిగిల్చావంటూ బాధపడ్డారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను.. శనివారం ఉదయం ఇంటి దగ్గర గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోని ఆస్పత్రికి తరలించారు. ఈ …
Read More »మంత్రి నారాలోకేశ్‌ను కలిసిన మంచు విష్ణు.. కారణమేమిటంటే?
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను ప్రత్యేకంగా కలిశారు. శనివారం (నవంబర్ 30) వీరిద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీతో పాటు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. అనంతరం నారా లోకేశ్ తో భేటీకి సంబంధించిన విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు మంచు …
Read More »