Tag Archives: Narendra Modi

G20 టాలెంట్ వీసాకు కేంద్రం ఆమోదం.. ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే?

కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన G20 సమ్మిట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ G20 టాలెంట్ వీసా ప్రతి పాదనను తీసుకొచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా దేశం మరింత అభివృద్ధి చెందాలంటే G20 టాలెంట్ వీసా చాలా అవసరమన్నారు. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇది అమలులో ఉంది.గ్లోబల్ అకడమిక్, టెక్నాలజికల్ సహకారం కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ G20 టాలెంట్ వీసాను ఆమోదించింది . G20 దేశాలకు చెందిన పండితులు, పరిశోధకులు నిపుణులను ఆకర్షించడం, …

Read More »

స్వచ్ఛ భారత్ అభియాన్.. ఆ విషయంలో దశాబ్దంలోనే ఎంతో మార్పు..

భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.. దశాబ్దం క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం నినాదంగా మారి ఎంతో మార్పును తీసుకువచ్చింది.. ఈ కార్యక్రమం ప్రారంభం తర్వాత దశాబ్దం క్రితం ఐదో వంతుతో పోలిస్తే ఇప్పుడు సగానికి పైగా భారతీయ కుటుంబాలు టాయిలెట్ క్లీనర్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇతర లక్ష్యాలతో పాటు, మరిన్ని మరుగుదొడ్లు నిర్మించడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరచడం ద్వారా బహిరంగ మలవిసర్జన ముగింపు పలికేందుకు మోదీ …

Read More »

వారికి మోదీ మరో శుభవార్త.. ఆయుష్మాన్ భారత్‌‌లోకి మరిన్ని ప్యాకేజీలు..!

‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)’ పథకాన్ని 70 ఏళ్ల దాటిన వృద్ధులకు వర్తింప జేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కోసం మరిన్ని ప్యాకేజీలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ఈ నెలాఖరులో కేంద్రం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ చికిత్సలతో పాటు 1,949 వైద్య సేవలను ఈ …

Read More »

నేడు ప్రధానితో సీఎం భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌, విశాఖ స్టీల్‌ప్లాంటు, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో హస్తినకు బయల్దేరతారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రోడ్డురవాణా మంత్రి నితిన్‌ …

Read More »

వాటే సీన్.. దేవీ.. హర్‌ ఘర్‌ తిరంగా సాంగ్ పాడుతుండగా.. ప్రధాని ఎంట్రీ..

నమో అమెరికా. అగ్రరాజ్యంలో భారతీయం ప్రతిధ్వనించింది. ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు ఎన్నారైలు. మోదీ మోదీ అనే నినాదాలతో న్యూయార్క్‌ మార్మోగింది. భిన్నత్వంలో ఏకత్వం. భాష ఏదైనా మనందరి మనసు భారతీయం…అన్న మోదీ ప్రసంగానికి ముగ్దులయ్యారు ఎన్నారైలు. A ఫర్‌ అమెరికన్స్‌..I ఫర్‌ ఇండియన్స్‌ అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కి సరికొత్త అర్ధం చెప్పారు మోదీ. భారత్‌-అమెరికా జోడి ప్రజాస్వామిక ప్రపంచానికి సరికొత్త దిశ-దశను చూపిస్తుందన్నారు. సప్తసముద్రాల అవతల భారతీయం పరిమళించింది. అగ్రరాజ్యంలో దేశభక్తి ఉప్పొంగింది. తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, …

Read More »

వయనాడ్‌లో ప్రధాని మోదీ.. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతం పరిశీలన

Narendra Modi: ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగినపడిన ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గత నెల 30 వ తేదీన వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో 416 మంది దుర్మరణం చెందగా.. 150 మందికి పైగా గల్లంతయ్యారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా వయనాడ్‌లో ప్రకృతి విపత్తు చోటు చేసుకున్న ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ క్రమంలోనే బాధితులకు అండగా నిలిచిన ప్రధాని …

Read More »

కేంద్రం స్కీమ్.. 5 శాతం వడ్డీకే 3 లక్షల లోన్.. రోజుకు రూ. 500, తర్వాత రూ. 15 వేల సాయం

PM Vishwakarma Scheme Benefits: దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు చాలా స్కీమ్ తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చిన్న మొత్తాల పొదుపు పథకాలు దాదాపు అన్ని వర్గాల వారి కోసం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా స్కీమ్స్ లాంఛ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 17న పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించింది. ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి 18 రకాల వర్గాలకు లబ్ధి చేకూరేలా వడ్డీలో రాయితీ కల్పిస్తూ రుణాలు మంజూరు …

Read More »

ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. 53 లక్షల కుటుంబాలకు లబ్ధి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా మరో 6.50 కోట్ల పనిదినాలు కేటాయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి కేంద్రం అదనంగా ఆరున్నర కోట్ల పనిదినాలు కేటాయించిదని డిప్యూటీ సీఎం ట్వీ్ట్ చేశారు. ఫలితంగా 53 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. పనిదినాలుు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెరిగిన పని దినాల …

Read More »

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం పెరిగిందా.. 

PM Kisan Scheme: దాదాపు అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో రైతులకు కూడా పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా.. అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడికి మద్దతు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది. దీని కింద ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు రూ. 6 వేల చొప్పున అందిస్తుంటుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేల …

Read More »