Tag Archives: pawan kalyan

Tirupati Laddu: పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు

Tirupati Laddu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. ఓ లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. ఆ పిల్‌ను స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు.. ఆయనకు సమన్లు ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు జారీ …

Read More »

Diarrhoea in Gurla: డయేరియా మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సాయం.. 10 లక్షలు

విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించారు. డయేరియాతో బాధపడుతూ గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌తో సమీక్ష జరిపిన పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తామన్న పవన్ కళ్యాణ్.. తన తరఫున వ్యక్తిగతంగా రూ. …

Read More »

కోర్టులు, చట్టాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వారాహి డిక్లరేషన్‌‌ విడుదల, ముఖ్యాంశాలివే!

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను అడ్డుకునేందుకు బలమైన, కఠినమైన చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. ఆ చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఈ వారాహి …

Read More »

బావ కళ్లల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో సంతోషం చూడండి పురందేశ్వరి గారూ..

ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే.. ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురందేశ్వరి.. బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడూ …

Read More »

తిరుమలలో డిక్లరేషన్‌పై పవన్ కళ్యాణ్ సంతకం.. కూతురి కోసం, టీటీడీ నిబంధనలు పాటిస్తూ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం పెట్టారు. పవన్ చిన్న కుమార్తె పొలెనా కొణిదెల కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే పొలెనా తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.

Read More »

ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ వివాదం తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు.. తిరుమల శ్రీవారికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భక్తులు, జనసైనికులకు మరో పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన, పవిత్రమైన …

Read More »

తిరుపతి లడ్డూ పై కార్తీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. హీరో రియాక్షన్ ఇదే..

తాజాగా నిన్న హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో కార్తీతోపాటు అరవింద్ స్వామి, మూవీ టీమ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై కార్తీ చాకచక్యంగా స్పందించాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు” అంటూ సమాధానం చెప్పాడు. కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ సత్యం సుందరం. ఇందులో …

Read More »

తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ.. పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ ఫైర్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా గత 2 రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన అంశం తిరుపతి లడ్డూ. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణం అయింది. తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడటం లేదని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఇక …

Read More »

అందుకే వరదబాధితుల వద్దకు రావట్లేదు.. పవన్ క్లారిటీ, బాధితులకు రూ.కోటి విరాళం

Deputy CM: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరదలతో అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు తన వంతుగా రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత, …

Read More »

గ్రామసభల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శాఖాపరమైన విషయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. శాఖల గురించిన సమాచారం తెలుసుకోవటంతో పాటుగా పాలనపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే సచివాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల కోసం ఈ నెలాఖర్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఆగస్ట్ 23 నుంచి గ్రామ సభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ సభల నిర్వహణ, విధివిధానాలపై పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ …

Read More »