తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కలగం పార్టీని స్థాపించిన విజయ్.. ఆదివారం టీవీకే మహానాడును నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన టీవీకే పార్టీ మొదటి మహానాడుకు అశేష జనవాహిణి హాజరైంది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో తమ పార్టీ సిద్ధాంతాలు, తాను రాజకీయాల్లోకి రావటానికి కారణాలను విజయ్ వెల్లడించారు. ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విజయ్‌ను పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో …
Read More »Tag Archives: politics
‘బెదిరిస్తున్నావా.. నా ఇంటికి రా.. వాళ్లు చెబితేనే చేశా’ భూమా అఖిలప్రియ వర్సెస్ జగన్
నంద్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, విజయ పాల డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. నంద్యాల విజయ డెయిరీకి వెళ్లిన ఆమె.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఉన్న శిలాఫలకాన్నే కాలువలో పడేయడంపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు.. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నంద్యాలలో పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని ప్రారంభించిన సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇప్పుడు తొలగించి కాలువపై వేయడంపై మండిపడ్డారు. …
Read More »వైసీపీకి బిగ్ షాక్.. అనుకున్నదే జరిగింది, టీడీపీలో చేరిన ఇద్దరు మాజీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా షాక్‌లు తప్పడం లేదు. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పార్టీకి, ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో.. మోపిదేవి, మస్తాన్ రావులు పసుపు కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు …
Read More »జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్, టీడీపీలోకి చేరాలనుకున్నా!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి విస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మొన్నటి వరకు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోయిన ఆయన చివరికి జనసేనవైపు మొగ్గు చూపారట. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆదివారం జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో చర్చించిన తర్వాత జనసేన పార్టీలో …
Read More »వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. పిన్నెల్లికి మరోసారి ఆ బాధ్యతలు, వరుసగా రెండోసారి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధినేత వైఎస్ జగన్. ఈ మేరకు జిల్లాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు.. జిల్లాలవారీగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో జైలుకు వెళ్లి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి అధినేత జగన్ కీలక బాధత్యలు అప్పగించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. అంతకముందు కూడా పిన్నెల్లి ఆ బాధ్యతల్లో ఉన్నారు.. ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జగన్ మళ్లీ నియమించారు. వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో పల్నాడు, …
Read More »