స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే.. భక్తుల విజ్ఞప్తితో దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు …
Read More »Tag Archives: srisailam
శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభం
శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించారు. శ్రీశైలంలో పర్వదినాలు, వారాంతపు సెలవు రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులు ప్రయాణించేందుకు వీలుగా ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సును అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ బస్సు గణేశ సదనం, అన్నప్రసాద భవనం మీదుగా క్యూ కాంప్లెక్సు వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని …
Read More »Chandrababu: శ్రీశైలానికి మహర్దశ.. తిరుమల తరహాలో.. మంత్రులతో కమిటీ ఏర్పాటు!
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీశైలం ఆలయ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి.. ఇందుకోసం పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, జనార్ధన్, కందుల దుర్గేష్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే శ్రీశైలం అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలతో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు కూడా …
Read More »విజయవాడ – శ్రీశైలం.. సీ ప్లేన్‌లో చంద్రబాబు జర్నీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీ ప్లేన్‌లో ప్రయాణించారు. శనివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో సీఎం చంద్రబాబు, విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్‌లో ప్రయాణించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులతో కలిసి చంద్రబాబు సీ ప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాతాళగంగ వద్ద నుంచి చంద్రబాబు రోప్ వేలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ …
Read More »శ్రీశైలంలో చిరుత కలకలం.. ఆలయ ఏఈవో ఇంటి దగ్గర సంచారం, భక్తుల్లో భయం
శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి దగ్గర చిరుత కనిపించింది. అక్కడ ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చింది.. ఆ పక్కనే ఉన్న కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు మొత్తం ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అలాగే ఈ తెల్లవారుజామున మరికొన్ని ఇళ్ల దగ్గర చిరుతపులి సంచారం కనిపించింది. జనాల నివాసాల దగ్గర చిరుత సంచారంపై స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంపై …
Read More »శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం.. హుండీలో విదేశీ కరెన్సీ.. బంగారం, ఎన్ని కోట్లంటే!
శ్రీశైలం మల్లన్నకు హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. శ్రీశైలం ప్రధాన ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో భక్తులు గత 29 రోజులుగా సమర్పించిన ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. హుండీ ద్వారా దేవస్థానానికి రూ.3,31,70,665 నగదు లభించింది. అలాగే 127 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి ఉన్నాయి. 4,445 యూఏఈ దిర్హమ్స్, 489 అమెరికా డాలర్లు, 5 లక్షల విలువైన వియత్నాం డాంగ్స్, 108 ఖతార్ రియాల్స్, 90 థాయిలాండ్ …
Read More »శ్రీశైలం ఆలయంలో అపచారం.. ఓ ఉద్యోగి సిగ్గు లేకుండా..?
శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది.. ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఉద్యోగి తీరు తేడాగా ఉండటంతో భక్తులకు అనుమానం వచ్చింది.. అతడ్నిపట్టుకుని భక్తులు చితకబాదారు. గురువారం రాత్రి 9 గంటలకు క్యూ కంపార్టుమెంట్లో ఈ ఘటన జరిగింది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల దగ్గర బైఠాయించి నిరసనను తెలియజేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయ అధికారి జి.స్వాములు అక్కడికి వచ్చారు. ఆందోళన విరమించాలని భక్తుల్ని కోరారు. ఆలయ అధికారి భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ఆలయ సిబ్బంది మద్యం తాగి …
Read More »శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు.. కృష్ణమ్మకు ముఖ్యమంత్రి జలహారతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వచ్చారు.. అక్కడ చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకోగా.. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక …
Read More »