భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం తెలంగాణ డీజీపీ జితేందర్‌ను కలిసిన జరీన్.. తన జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ డిపార్ట్‌మెంట్‌లోకి ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా కొత్త పాత్రను స్వీకరించినందున శుభాకాంక్షలు తెలిపుతూ.. ఆమెను …
Read More »Tag Archives: Telangana
త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్.. 20 MB స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా.. మంత్రి తీపికబురు
తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ల సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 17న) రోజున కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న తర్వాత.. స్థానిక ఆర్ అండ్ బీ గెస్టు హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు …
Read More »ఏపీ, తెలంగాణకు నారా భువనేశ్వరి భారీ విరాళం.. హెరిటేజ్ తరఫున కళ్లు చెదిరే మొత్తం
ఆంధ్రప్రదేశ్‌కు వర్షం, వరద రూపంలో పెద్ద విపత్తు వచ్చిపడింది. ముఖ్యంగా విజయవాడ పరిస్థితి దయనీయంగా ఉంది.. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది. రాష్ట్రంలో పరిస్థితుల్ని చూసిన ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నాయి.. కొందరు విరాళాలు ప్రకటిస్తుంటే.. మరికొందరు ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి భారీగా …
Read More »యాచారం ఫార్మాసిటీ ఉన్నట్లా? లేనట్లా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల పరిధిలో 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు భూసేకరణ కూడా చేపట్టింది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మాసిటీ సేకరించిన భూముల్లో గ్రీన్ సిటీ టౌన్‌షిప్‌లు అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఈ ఫార్మా భూములు విషయంలో హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఫార్మాసిటీ ఉన్నట్లా..? …
Read More »వరద బాధితులకు తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం.. ఎంత ప్రకటించారంటే..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి. దీంతో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల ప్రజలు ముంపు బాధితులుగా మిగిలారు. భారీ వరదలకు ఇల్లు వాకిలి కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారారు. దీంతో వారిని అదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా.. వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సాయం ప్రకటించారు. వరద బాధితుల కోసం ఎమ్మెల్సీగా తనకు వచ్చే ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి …
Read More »ఖమ్మంలో భారీ వరదలకు కారణమదే.. ఆ విషయంపై చర్చిస్తాం: సీఎం రేవంత్
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో అయితే వేల మంది నిరాశ్రయులుగా మారారు. మున్నేరు వరదు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్.. ఆక్రమణల వల్లే ఖమ్మం పట్టణాన్ని వరదలు ముంచెత్తాయన్నారు. గతంలో గొలుసు కట్టు చెరువులు ఉండేవని ప్రస్తుతం చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. పట్టణంలో వరదలకు కారణమైన మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు …
Read More »ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రసుత్తం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ (మహారాష్ట్ర) వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం …
Read More »ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా …
Read More »ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటికి ‘హైడ్రా’ నోటీసులు..?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎవ్వరినీ లెక్క చేయకుండా బుల్డోజర్లు పంపిస్తున్నారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక ఇప్పటికే కొందరు అక్రమ నిర్మాణదారులకు హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. మాదాపూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. ఇక …
Read More »గచ్చిబౌలిలో ప్రేమోన్మాది ఘాతుకం.. బ్యూటీషియన్ దారుణ హత్య
హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై కత్తితో దాడిచేసి.. ప్రాణాలు తీశాడు. బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు యువతులు గాయపడ్డారు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటకలోని బీదర్‌కు చెందిన నిందితుడు రాకేశ్, మాదాపూర్‌లోని ఓ ప్రయివేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ (25) అనే యువతి …
Read More »