Tag Archives: tiruapti

తిరుపతిలోని హోటల్ కు మరోసారి బాంబు బెదిరింపులు..అధికార యంత్రాంగం అలర్ట్‌..

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్రమత్తమైన పోలీసులు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు తరచూ ఇలా ప్రైవేటు హోటల్స్‌కు వస్తున్న ఫేక్‌ మెయిల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు ఆగటం లేదు. తాజాగా నగరంలోని ఓ హోటల్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో కలకలం రేపింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్‌ సవాల్‌గా మారగా, సదరు హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డిసెంబర్‌ 8ఆదివారం రోజున కపిలతీర్థం రోడ్‌లోని రాజ్‌పార్క్‌ …

Read More »

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..!

విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి సింగపూర్‌కు ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ గురువారం గాలిలోకి ఎగిరింది. టెంపుల్ సిటీ తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో తిరుపతి నుంచి సింగపూర్‌కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5 …

Read More »

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై భక్తులు కోరినన్ని లడ్డూలు

వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహా విష్ణువు ఇలవైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించి కోనేతిరాయుడి అనుగ్రహం పొందాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. స్వామివారి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాముఖ్యత శ్రీవారి ప్రసాదం లడ్డుకి ఉంది. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అంటే లడ్డు తీసుకుని రా అని చెబుతారు. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి ఎంత ఫేమసో.. శ్రీవారి లడ్డూ కూడా అంతే ఫేమస్. ఈ లడ్డు రుచి గురించి …

Read More »

ఏడుకొండల వాడి దర్శనానికి నడక మార్గాల్లో వెళ్తున్నారా.. ఈ సమస్యలున్నవారు జాగ్రత్త పాటించాల్సిందే..

తిరుమల వెంకన్న దర్శనం కోసం.. నడక మార్గాల్లో కొండకెళుతున్నారా.. అయితే కొన్ని సూచనలు పాటించాల్సిందేనని చెబుతోంది టీటీడీ. అయితే జాగ్రత్తల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న భక్తులు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా ఈ మధ్యకాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లయిన వారం రోజుల్లోపే బెంగళూరు కు …

Read More »

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఆ సమస్యకు చెక్, స్వయంగా రంగంలోకి దిగిన ఏఈవో!

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ అడిషనల్ ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనం రుచి, నాణ్యత గురించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు‌. అనంతరం భక్తులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యత చాలా బాగుందని భక్తులు అడిషనల్ ఈవో దగ్గర ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శాస్త్రి పాల్గొన్నారు. తిరుమలలో అన్నప్రసాదంపై టీటీడీ ఫోకస్ పెట్టింది.. పరిస్థితిని …

Read More »