తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ వెల్లడించింది. తిరుమల, తిరుపతి దేవస్థానం డిసెంబర్ కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం , శ్రీవాణి టికెట్ల ను సోమవారం విడుదల చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబర్ 2024 నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తుంది. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ నెల కోటాకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్‌లను …
Read More »Tag Archives: tirupati
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి హోమం.. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ
తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి హోమం మొదలైంది. శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతిహోమం సంకల్పించారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఈ హోమాన్ని అర్చకులు చేయనున్నారు. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు.. భక్తవత్సలుడు కొలువైన ప్రాంతం..! అలాంటి తిరుమల కొండపై.. ఆ దేవదేవుడి కైంకర్యాలకు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే వార్త పెను సంచలనమే …
Read More »తిరుపతి లడ్డూ వివాదం వేళ.. తిరుమలలో మహాశాంతి యాగం!
తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో శనివారం టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆగమ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి వాడారన్న వార్తల నేపథ్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం ఏం చేయాలనే దానిపై చర్చించారు. శ్రీవారి లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో తిరుమలలో …
Read More »మీరు మీ హద్దుల్లో ఉండండి.. ప్రకాష్ రాజ్‌కు విష్ణు మంచు వార్నింగ్
తిరుమల లడ్డు వివాదం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఏపీలోని జగన్ ప్రభుత్వం టీటీడీ, తిరుమల ప్రతిష్టను దెబ్బ తీసేలా, భక్తుల మనోభవాలు దెబ్బ తీసేలా వ్యవహరించిందని, లడ్డూ తయారికి నాసిరకం నెయ్యిని.. జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్‌తో కూడిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయాలని.. జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఓ కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ …
Read More »తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. BJP ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ అంశం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్ చేయటం సంచలనంగా మారింది. ఈ అంశం దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. శ్రీవారి ప్రసాదాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలుపుతున్నారనే విషయం బయటకు రావటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కేంద్రమంత్రి నడ్డా ఏపీ సీఎం చంద్రబాబును వివరణ కూడా కోరారు. పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. తాజాగా.. ఈ వివాదంపై …
Read More »తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో.. జాతీయస్థాయి నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల బాలాజీ భారత్‌పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడని.. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ ప్రతి భక్తుడినీ ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ఈవిషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై క్షుణ్ణంగా …
Read More »తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. టీటీడీ సంచలన నిర్ణయం, వెంటనే అవి కూడా రద్దు
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగిస్తున్న కల్తీ నెయ్యిని ఉపయోగించారనే అంశంపై టీటీడీ కూడా స్పందించింది. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి తిరుమలలో పరిపాలనాపరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు శ్యామలరావు. లడ్డూకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే టీటీడీ లడ్డూ ప్రసాదం నెయ్యితో పాటుగా తిరుమల శ్రీవారి నైవేద్య అన్న ప్రసాదాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలలో వినియోగించే గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాలను తాత్కాలికంగా రద్దు …
Read More »తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం వేళ కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం
తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని, జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలకు కేవలం …
Read More »తిరుపతి లడ్డూ వ్యవహారం.. ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ అంశం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ . ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన ట్యాంకర్లలోనే కల్తీ నెయ్యి వచ్చినట్లు తేలిందని.. స్వయానా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. ల్యాబ్ టెస్టుల్లో ఈ విషయం తేలిందన్నారు. …
Read More »తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం.. తెరపైకి పవన్ కళ్యాణ్ సంచలన డిమాండ్
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన ట్వీట్‌పై పవన్ స్పందించారు. ఈ లడ్డూ ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని.. వైఎస్సార్‌సీపీలో హయాంలో ఉన్న టీటీడీ పాలకమండలి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం దారుణమని.. ఇది అందరి మనోభావాలనూ దెబ్బతీసిందన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. …
Read More »