తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరదనీటితో కొన్ని రైల్వే ట్రాక్‌లు మునిగిపోవడంతో.. దక్షిణ మధ్య రైల్వే అత్యవసర చర్యలు చేపట్టింది. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని మార్గమార్చారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం కరీంనగర్–కాచిగూడ, కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–మెదక్, మెదక్–కాచిగూడ, బోధన్–కాచిగూడ, ఆదిలాబాద్–తిరుపతి రైళ్లు రద్దు అయ్యాయి. గురువారం నిజామాబాద్–కాచిగూడ రైలు రద్దు కానుంది. మహబూబ్‌నగర్–కాచిగూడ, షాద్‌నగర్–కాచిగూడ రైళ్లను కొంత దూరం వరకే నడిపి పాక్షికంగా రద్దు చేశారు. కామారెడ్డి–బికనూర్–తలమడ్ల, అకన్పేట్–మెదక్ మధ్య రైల్వే …
Read More »