Tag Archives: Vijayawada

విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, రికార్డ్ బ్రేక్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే శుక్రవారం కనకదుర్గమ్మ దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది.. ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరింది. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చింది. అలాగే 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100.. రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అలాగే 26,584 లడ్డూలను విక్రయించగా.. రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్‌ లను విక్రయించగా రూ.44,06,600 …

Read More »

నేటి అలంకారం శ్రీ గాయత్రీ దేవి

శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండోరోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు నేడు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరారే అయిదు ఆశ్వయుజ శుద్ధ విదియ, శుక్రవారం శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండోరోజున విజయవాడలో కనకదుర్గమ్మ వారు నేడు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో ముత్యం, పగడం, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరారే అయిదు ముఽఖాలతో, ప్రతి ముఖంలో మూడు నేత్రాలతో, శిరస్సున చంద్రరేఖతో, దశ హస్తాలలో ఆయుధ- ఆభరణాలు ధరించి అమ్మవారు ప్రకాశిస్తారు. సకల మంత్రాలకూ …

Read More »

విజయవాడ దుర్గమ్మకు ముంబై భక్తుడి ఖరీదైన కానుక.. వజ్ర కిరీటం విలువ ఎంతో తెలిస్తే!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముగ్గురు భక్తులు భారీగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వజ్రకిరీటంతో దర్శనమిస్తారు. శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ముగ్గురు భక్తులు వజ్రకిరీటం, బంగారు ఆభరణాలు సమర్పించారు. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ అందజేశారు. సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన తెలిపారు. అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన …

Read More »

విజయవాడ: నీళ్లలో తిరిగి కాలు పోగొట్టుకున్న బాలుడు.. ఆ బ్యాక్టీరియా చాలా డేంజర్

ఇటీవల వరదలు విజయవాడతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తాయి. అయితే వరద నీటిలో తిరిగిన ఓ బాలుడు కాలును పోగొట్టుకున్నాడు. నీళ్లలో తిరిగితే కాలు పోయిందా అంటే.. దీనికి వెనుక కారణం ఉంది. ఒక బ్యాక్టీరియా కారణంగా బాలుడు కాలును కోల్పోవాల్సి వచ్చింది.. రెండో కాలుకు కూడా ఆ బ్యాక్టీరియా సోకింది. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న కొత్తా నాగరాజు ప్రైవేట్ కంపెనీలో.. కోడలు ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కుమారుడు భవదీప్ ఏడో తరగతి చదువుతున్నాడు. భవదీప్ …

Read More »

విజయవాడ వరదలో సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు నష్టపోయారా.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు అపార నష్టాన్న మిగిల్చాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లో వరద దెబ్బకు ఇళ్లు నీటమునిగాయి.. దీంతో ఇళ్లలో వస్తువులతో పాటుగా కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు, ఈ వరదల్లో ముఖ్యంగా ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఇతర సర్టిఫికెట్లు నీళ్లలో పాడైపోయాయి. ఇలా సర్టిఫికేట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. …

Read More »

ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.25వేలు, రూ.10వేలు జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వర్షాలు, వరద బాధితులకు నేడు సాయం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి కూటమి ప్రభుత్వం ప్యాకేజీని అందజేస్తోంది. నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో పలువురు వరద బాధితులకు సీఎం చంద్రబాబు సాయం అందజేస్తారు. ఈ 4 లక్షలమందిలో విజయవాడ పరిధిలోనే సుమారు లక్షన్నర మంది బాధితులు ఉన్నారు. ఇవాళ ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను బాధితులకు సాయం కింద ప్రభుత్వం పంపిణీ చేయనున్నారు. అలాగే ఇళ్లు, షాపులు, వాహనాలు, పంటలు, పశువులు, తోపుడు …

Read More »

విజయవాడలో వెరైటీ దొంగ.. ఆ టైంలో మాత్రమే చోరీలు, రాత్రిళ్లు మాత్రం!

విజయవాడలో ఓ దొంగ ఆట కట్టించారు పోలీసులు. కొద్దిరోజులుగా నగరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. మనోడి గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మనోడు రాత్రిళ్లు చోరీలు చేయడం.. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి.. మనోడి ట్రాక్ రికార్డ్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. మహంతిపురంకు చెందిన షేక్ షబ్బీర్‌బాబు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు.. జల్సాల కోసం డబ్బులు కావాలి.. అందుకే విజయవాడలో దొంగతనాలు మొదలుపెట్టాడు. దీని కోసం ముందుగానే ఓ ప్లాన్ వేసుకుంటాడు. విజయవాడలో పగటి …

Read More »

ఏపీలో వారందరికి రూ.25వేలు, రూ.10వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

ఏపీని వర్షాలు, వరదలు వణికించాయి.. విజయవాడతో పాటూ మరికొన్ని జిల్లాలపై ప్రభావం కనిపించింది. ప్రధానంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి.. ఇళ్లన్నీ నీటమునిగాయి. ఇలా వర్షాలు, వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఏపీప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్యాకేజీని అందజేసే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు రూ. 25 వేలు.. అలాగే …

Read More »

ఏపీలో వరద బాధితులకు స్పెషల్ కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే

ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేస్తోంది. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికీ పాలు, మంచినీరు, బిస్కట్లు అందిస్తున్నారు. ఈ కిట్‌లలో 25 కిలోల బియ్యం, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో కందిపప్పు, కిలో చక్కెర ఉంటుంది. మొబైల్‌ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందిస్తారు. రూ.2, రూ.5, రూ.10 చొప్పున మూడు స్థాయుల్లో ధరల్ని నిర్ణయించారు. అంతేకాదు అన్ని …

Read More »

ఏపీ వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం.. చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు సాయంపై కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని.. ప్రతి ఇంటికి సహాయం అందించాలని సూచించారు. రాష్ట్రంలో వరద వల్ల నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని చెప్పారు. ఈ వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాల వారికి అప్పగించాలని.. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే …

Read More »