విజయవాడ వరదలో సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు నష్టపోయారా.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు అపార నష్టాన్న మిగిల్చాయి. విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లో వరద దెబ్బకు ఇళ్లు నీటమునిగాయి.. దీంతో ఇళ్లలో వస్తువులతో పాటుగా కొంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు, ఈ వరదల్లో ముఖ్యంగా ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఇతర సర్టిఫికెట్లు నీళ్లలో పాడైపోయాయి. ఇలా సర్టిఫికేట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. దీని కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వ భావిస్తోంది.

వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న విద్యార్థులకు సంబంధించిన అంశంపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో.. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణమే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే భవిష్యత్తులో విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో డిజి లాకర్స్ సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాదు ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని.. అందుకే ఈ డిజి లాకర్స్‌ను ఏఐతో అనుసంధానించడం ద్వారా సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయవచ్చన్నారు మంత్రి లోకేష్.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని నేడు అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ నుంచి నేరుగా డీబీటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. విజయవాడ పరిధిలో ఉన్న వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులకు అందించే సాయంపై ఎన్యుమరేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు. అలాగే బుడమేరు ఉద్ధృతికి నష్టపోయిన బాధితులకు ఇవాళ సాయం అందిస్తున్నారు. ఒకవేళ అర్హత ఉండి పరిహారం అందకపోయినా.. వారి వివరాలు సేకరించి సాయం అందిస్తామని చెబుతోంది ప్రభుత్వం. ఇప్పటికే అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు అధికారులు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కూడా ఇవాళ అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేయనున్నారు.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *