పైకి చూస్తే పాన్ షాపు.. రోజూ జనాలతో రద్దీ, అనుమానంతో వెళ్లి చూస్తే!

విశాఖపట్నంలో గంజాయి చాక్లెట్లు కలకలంరేపాయి.. ఇటీవల పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. చాక్లెట్ల రూపంలో గంజాయిని ప్యాక్ చేసి అమ్మేస్తోంది.. ఓ పాన్‌లో షాపులో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నంలోని క్రాంతిథియేటర్‌ ఎదురుగా మనోజ్‌కుమార్‌చౌదరి పాన్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. అతడి షాపులో గంజాయితో తయారుచేసిన చాక్లెట్లను రహస్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కగా సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ పాన్ షాపులో దాడులు చేయగా.. అమ్మకానికి సిద్ధంగా ఉంచి 133 గంజాయి చాకెట్లు (660 గ్రాములు) దొరికాయి.చాకెట్లను సీజ్ చేసిన పోలీసులు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.

నాలుగు నెలలుగా గంజాయి రవాణాపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.. అందుకే గంజాయిని విక్రయించే గ్యాంగులు అనేక కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లు, లిక్విడ్‌ గంజాయి రూపంలో మొన్నటి వరకు అమ్మకాలు జరిపేవారు. తాజాగా చాక్లెట్ల రూపంలో విక్రయిస్తుండగా గుర్తించిన పోలీసులు పాన్‌షాప్‌ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది.

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలు, రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల భారీగా గంజాయిని కూడా సీజ్ చేశారు.. అలాగేగంజాయి విక్రయించే వారిని పిలిచి హెచ్చరించారు.. వెంటనే గంజాయి నుంచి బయటపడాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఎవైరనా గంజాయితో పట్టుబడితే వారిపై రౌడీషీట్‌ తెరుస్తామని హెచ్చరించడమే కాకుండా వారి కదలికలపై నిరంతరం నిఘా పెడుతున్నారు. అంతేకాదు చాలామంది పోలీసుల వార్నింగ్‌తోజజ గంజాయి విక్రయించే వ్యవహారాల నుంచి ఇప్పటికే బయటకొచ్చేశారు. అయినా అక్కడక్కడా ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ గంజాయిని విశాఖ ఏజెన్సీ నుంచి బెంగళూరు, చెన్నై తదితర దూర ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. అందుకే ఆ ప్రాంతంతో పాటుగా జిల్లాల్లో చెక్‌పోస్ట్‌ల దగ్గరన తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు పోలీసులు గంజాయి సాగు నివారణకు గంజాయి సాగు చేసిన ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేస్తున్నారు. గంజాయి సాగు, రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

About amaravatinews

Check Also

ఉదయగిరిలో దారుణ హత్య.. పట్టపగలు అందరూ చూస్తుండగానే నరికి చంపారు!

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వద్ద మహమ్మద్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *