హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ..గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా.. సికింద్రాబాద్లోని పలు షవర్మ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. శాంధార్ షవర్మ, రోల్స్ ఆన్ వీల్స్, ముజ్ తాబా గ్రిల్స్, ఆసియన్ చో, సింక్ షవర్మ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షవర్మా సెంటర్ల నిర్వహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు.
షవర్మ తయారు చేసే చోటు అపరిశుభ్రంగా ఉందని ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. షవర్మ తయారీలో ప్రమాదకర సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు గుర్తించారు. మాంసం, పన్నీర్ ఎలాంటి లేబుల్ లేకుండా ఉన్నాయని.. వాటిని ఎక్స్పెయిరీ డేట్ లేకుండా స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. వెజ్, నాన్వెజ్ ఐటమ్స్ ఒకే దగ్గర స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ చాలా ప్రమాదకరమని.. వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.