TATA Group: ఏపీకి టాటా గ్రూప్ బంపరాఫర్.. టీసీఎస్‌ మాత్రమే కాదు అంతకు మించి..!

Tata Companies Chairman Chandrasekaran meets CM Nara Chandrababu naidu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో టీసీఎస్ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌, ఇవాళ (సోమవారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు. దివంగత రతన్ టాటా తన దార్శనిక నాయకత్వం, సహకారంతో మనదేశ పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేశారన్న చంద్రబాబు నాయుడు.. ఏపీ అభివృద్ధికి కూడా ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లేలా నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు జరిగినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక భాగస్వామిగా ఉందన్న నారా చంద్రబాబు నాయుడు.. నటరాజన్ చంద్రశేఖరన్‌తో జరిగిన భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాటా గ్రూప్ పరస్పర సహకారంతో ఏపీని ఎలా అభివృద్ధి చేయవచ్చనే దానిపై చర్చించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో టీసీఎస్ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు టాటా గ్రూప్ ముందుకు వచ్చిందన్న చంద్రబాబు.. పది వేల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా టీసీఎస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

About amaravatinews

Check Also

రథసప్తమి.. సూర్యప్రభ వాహనంపై దేవదేవుని కటాక్షం..పరవశించిపోయిన భక్తజనం..ఆ ఫోటోలు ఇవిగో..

తిరుమల క్షేత్రంలో సూర్య జయంతి వేడుక ముగిసింది. రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *