టాటా గ్రూప్‌లోని మెటల్ దిగ్గజ సంస్థ టాటా స్టీల్ (TATA Steel) స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. అయితే ఈ స్టాక్ గత ఆగస్టు నెలలో ఇన్వెస్టర్లను నిరాశపరిచిందని చెప్పవచ్చు. 3 శాతం మేర క్షీణించింది. అయితే కంపెనీ సెప్టెంబర్ 1, 2024 రోజున చేసిన ఓ ప్రకటనతో ఫోకస్‌లోకి వచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు టాటా స్టీల్ స్టాక్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
టాటా గ్రూప్ అనుబంధ కంపెనీల్లో ఒకటైన ది ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ టాటా స్టీల్ లిమిటె కంపెనిలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచే ఈ విలీనం అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. టాటా గ్రూప్ మొత్తంగా 6 ప్రముఖ కంపెనీలను విలీనం చేసే పక్రియను 2022 సంవత్సరంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాటిల్లో మూడు లిస్టెడ్ సంస్థలైన టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, ది టిన్ ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా ఉన్నాయి. వీటితో పాటుగా ది ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్ అండ్ టీ మైనింగ్ కంపెనీలు విలీనమవుతున్నాయి.
Amaravati News Navyandhra First Digital News Portal