తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బంపరాఫర్.. ఐడియా అదిరింది!

తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పార్టీ సభ్యత్వాలను ప్రాంరభించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్2 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే రూ.లక్ష పైబడి సభ్యత్వం చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని నేతలకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.. వారందరితో మాట్లాడారు. ఈ సమావేశం మంగళవారం అర్ధరాత్రి వరకు సాగగా.. పార్టీకి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించారు.

తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదుకు 70 లక్షల మంది వరకు ముందుకొస్తారని అంచనా వేస్తున్నారు. అయితే వీరిలో లక్ష మంది రూ.లక్ష చొప్పున సభ్యత్వం కడితే తద్వారా ఏడాదికి రూ.70 కోట్ల వడ్డీ వస్తుందని లెక్కలు వేశారట. ఆ మొత్తంతో కార్యకర్తలకు మెరుగైన సంక్షేమం అందించొచ్చని టీడీపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుని.. వారిని మెరుగైన స్థితిలోకి తీసుకొచ్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

అంతేకాదు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన, సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 20 నుంచి 26 వరకు దీనిపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలని నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే పార్టీ నేతలు మిత్రపక్షాల నాయకులతో సమన్వయంతో పని చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. అంతేకాదు పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన నేతలను గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో జిల్లా ఇంఛార్జ్ మంత్రుల నియామకం చేపడతామని నేతలతో చెప్పారు. మరోవైపు ఇవాళ ఎన్డీఏపక్ష మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. 100 రోజుల పాలన, మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *