తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. KCR రికార్డ్ బ్రేక్‌ చేసిన సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సోమవారం (జులై 29) ఐదో రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లింది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4.40 నుంచి 5. 50 వరకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్‌ అనంతరం అసెంబ్లీ మళ్లీ మొదలైంది. సుమారు 17 గంటలకు పైగా అసెంబ్లీ సమావేశాలు సాగాయి.

దీంతో మాజీ సీఎం కేసీఆర్‌ రికార్డును ప్రస్తుత సీఎం రేవంత్‌ బ్రేక్‌ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు సభ జరిగింది. అప్పట్లో అదే రికార్డ్‌. అయితే ఇప్పుడు ఆ రికార్డును రేవంత్‌ ప్రభుత్వం బ్రేక్‌ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం టీ బ్రేక్‌ తరువాత మంగళవారం తెల్లవారు జామున 3.15 వరకు కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్కల ప్రసంగం, మంత్రి కోమటిరెడ్డి Vs జగదీశ్ రెడ్డి, మంత్రి సీతక్క Vs కౌశిక్ రెడ్డి మధ్య మాటలయుద్ధం నడిచింది. బడ్జెట్ నిధులు, విద్యుత్ రంగంపై చర్చలు హాట్‌హాట్‌గా సాగాయి.

నేడు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. స్కిల్ యూనివర్సిటీ బిల్లు నేడు సభ ముందుకు రానుంది. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెండో విడత రుణమాఫీ ప్రారంభించనున్నారు. అసెంబ్లీ వేదికగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో కార్యక్రమం నిర్వహించనుండగా.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నంచి ఇద్దరు రైతుల చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.

About amaravatinews

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *