Medical Reimbursement Money Released: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇక మీదట మెడికల్ బిల్లుల రియింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేని సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి మొత్తం ఆన్‌లైన్ ద్వారానే మెడికల్ బిల్లులను సబ్మిట్ చేయాలని.. తద్వారా నిధుల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఉద్యోగులు మెడికల్ రియంబర్స్‌మెంట్ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు.. హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే.. దీనిపై అతి త్వరలోనే కార్యాచరణ సైతం చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం ఆస్పత్రికి సంబంధించిన బిల్లులను నేరుగా తీసుకొని పరిశీలించేవారు. అయితే.. ఇకపై ఆన్‌లైన్ ద్వారా మాత్రమే మెడికల్ బిల్లులను సబ్మిట్ చేయాలని.. తద్వారా పని ఇంకాస్త వేగవంతం పూర్తవుతుందని.. ఫలితంగా డబ్బులు కూడా త్వరగా అందుతాయని అధికారులు వివరిస్తున్నారు.