కోనసీమ కుర్రోడు, కెనడా అమ్మాయి.. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, ఆ ఊర్లో సందడే, సందడి

తెలుగు రాష్ట్రాల నుంచి యువత ఖండాంతరాలు దాటి విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్నారు. అక్కడి అమ్మాయి, అబ్బాయిల ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. మన తెలుగు కుర్రాళ్లు.. అక్కడి అమ్మాయిలను ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మరో తెలుగు యువకుడి ప్రేమ కథ ఖండాంతరాలు దాటింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అబ్బాయి.. కెనడా అమ్మాయిని ప్రేమించి సంప్రదాయంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ ప్రేమ పెళ్లికి కోనసీమ వేదికగా నిలిచింది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన మనోజ్‌కుమార్‌ బీటెక్ పూర్తి చేశారు. ఆయన 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్యకోసం కెనడా వెళ్లారు.. ఆ తర్వాత అతడికి ఉద్యోగం కూడా వచ్చింది. మనోజ్ ప్రస్తుతం అక్కడే బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన చదువుకునే రోజుల్లో కెనడాకు చెందిన ట్రేసి రోచెడాన్‌తో పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు.

ఇటీవల కెన్యాలో ఘనంగా నిశ్చితార్థం నిర్వహించారు.. ఆ వెంటనే కెనడాలో వివాహం కూడా చేసుకున్నారు. అయితే మనోజ్ హిందూ సంప్రదాయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు రెండు రోజుల క్రితం ఈదరపల్లి వచ్చారు. సోమవారం పెళ్లికొడుకు, పెళ్లికూతురు చేసే వేడుక, హల్దీని ఘనంగా నిర్వహించారు. ఈ వారంలో దిండిలో వివాహం చేసుకుని.. 8న రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు మనోజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. మనోజ్‌కుమార్ పెళ్లి వేడుకలో విదేశీ అతిథులు కూడా సందడి చేస్తున్నారు. యువతి తరఫున కుటుంబ సభ్యులు, బంధవులు, స్నేహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరంతా కోనసీమ అందాల్ని చూసి మైమరిపోతున్నారు. ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందని.. ఇక్కడ పల్లెటూరి వాతావరణం ఎంతో నచ్చింది అంటున్నారు. మొత్తం మీద మనోజ్‌కుమార్, కెనడా అమ్మాయి ట్రేసి రోచెడాన్‌ పెళ్లితో ఈదరపల్లిలో సందడి వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి.

About amaravatinews

Check Also

Ys Jagan మనకి మంచే చేశారు.. ఏపీ అసెంబ్లీలో రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు

ఓ విధంగా జగన్ మంచి చేశారంటున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. రూ. 400 కోట్లు పెట్టీ జగన్ తన రాజకీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *