లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు విడుదల..

తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ లింబాద్రి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టీజీ లాసెట్ ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా రావాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు. పీజీ ఎల్ సెట్ 2024 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా రావాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

తెలంగాణలోని న్యాయకళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ర్యాంకు కార్డు కోసం అధికారిక వెబ్‌సైట్‌ lawcet.tsche.ac.inలో సంప్రదించాలి. టీజీ లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ జూన్‌ 3న పరీక్ష నిర్వహించారు. టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు తొలి రెండు సెషన్లు కలిపి మొత్తం 68 కేంద్రాల్లో నిర్వహించారు. ఇక మూడో సెషన్‌ పరీక్షలను మొత్తం 50 కేంద్రాల్లో నిర్వహించారు.

About amaravatinews

Check Also

భవనం కూల్చివేశారు సరే.. మా భవిష్యత్తేంటి? గచ్చిబౌలి ఘటనలో ట్విస్ట్

గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌లో నాలుగంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒకపక్కకు ఒరిగి భయాందోళన సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *