హైదరాబాద్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇక నుంచి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా నాలుగు ఆర్టీసీ (205 F) బస్సులను నేటి నుంచి నడపనున్నట్లు కాచిగూడ డిపో మేనేజర్ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సు చొప్పున ఈ బస్సులురాకపోకలు సాగిస్తాయన్నారు. రాత్రి 8.40 గంటలకు కాచిగూడ నుంచి చివరి బస్సు ఉంటుందన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ప్రతిరోజు ఉదయం 7.10 గంటలకు బస్సు ఉంటుందని.. ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున రాత్రి 10 గంటల వరకు ఇక్కడి నుంచి బస్సులు నడుస్తాయన్నారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నల్గొండ చౌరస్తా, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని బస్సు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.