నాగార్జున సాగర్ సందర్శనకు వెళ్తున్నారా..? TGSRTC గుడ్‌న్యూస్

ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా శ్రీశైలం డ్యాం నుంచి నాగర్జున సాగర్ డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు చేరుకుంది. అయినా ఇంకా ఫ్లో వస్తుండటంతో సాగర్ గేట్లను సైతం అధికారులు పైకి ఎత్తారు. మెుత్తం 20 గేట్లను 5 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

రెండేళ్ల తర్వాత సాగర్ గేట్లు పైకి ఎత్తటంతో జలసవ్వడి చూసేందుకు భారీగా జనం సాగర్ వెళ్తున్నారు. నిన్నటి నుంచి సాగర్ జలాశయానికి పర్యాటకు తాకిడి ఎక్కువైంది. హైదరాబాద్ నగరం నుంచి కూడా చాలా మంది పర్యాటకు సాగర్ వెళ్తున్నారు. శ్రీశైలంతో పోలిస్తే.. సాగర్ నగరానికి దగ్గర ఉండటంతో అక్కడకు వెళ్లేందుకు మెుగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ జల సోయగాలు చూడాలనుకునే పర్యాటకులకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీపి కబురు చెప్పారు.

హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి డైరెక్టుగా సాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ మేరకు రీజియన్ మేనేజర్ శ్రీలత ప్రకటన విడుదల చేశారు. నల్గొండ డిపో ఆధ్వర్యంలో ఈ సర్వీసులు నడుస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఎంజీబీఎస్‌లో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు, 6.45 గంటలకు, 7. 15, 7.30, 8, 9.45, 10.45 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలకు సాయంత్రం 5 గంటలకు, 5.40 గంటలకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు.

ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం నేరుగా డీలక్స్ బస్సులు సాగర్ నడపనున్నట్లు తెలిపారు. సాగర్ వెళ్లాలనుకునే పర్యాటకులు టీజీఆర్టీసీ సేవలను వినియోగించుకుని సుఖవంతమైన, సురక్షిత ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్లి డబ్బులు వృథా చేసుకోవటం కంటే ఆర్టీసీ బస్సుల్లో తక్కువ టికెట్ ధరకు ప్రయాణాలు సాగించాలని సూచించారు.

About amaravatinews

Check Also

ఏపీ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

స్త్రీ శక్తి పథకం పరిధి మరింత పెరిగింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లోనూ మహిళలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *