తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. చెన్నై భక్తుడు పెద్ద మనసుతో, కొండపై పరిశుభ్రత కోసం

తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన సంస్థ లారీని విరాళంగా అందజేసింది. చెన్నైకి చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ కార్తీక్ ‌ టీటీడీకి చెందిన లారీ చేసేస్ కు రూ.8 లక్షల విలువగల బాడి ఫిట్ చేసి తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, తిరుమల డీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి బుధవారం సాయంత్రానికి క్యూలైన్‌లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 21 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఈ భక్తులకు దాదాపు 12 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుందని టీటీడీ తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి రెండు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతోంది.. టీటీడీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు ఆగష్టు 30, 31వ తేదీలలో టెండర్‌ కమ్‌ వేలం (ఆఫ్‌లైన్‌) వేయనున్నారు. ఇందులో కాపర్ – 2 (3000కేజిలు) -15 లాట్లు ఆగష్టు 30న, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు (2,400 కేజిలు) -12 లాట్లు ఆగష్టు 31వ తేదీ వేలానికి ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించాలని టీటీడీ సూచిస్తోంది.

టీటీడీలోని వివిధ విభాగాలపై ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్షించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఆయన ఛాంబర్‌లో ఈవో సమీక్ష నిర్వహించారు. శాఖాపరమైన సమావేశాలలో భాగంగా శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ, పంచాయతీ, రిసెప్షన్, పారిశుధ్యం, అన్నప్రసాదం విభాగాలతో ఈవో సమీక్షించారు. ఆయా ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధిపతులందరికీ ఆయన సూచించారు. ఈ సమావేశంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవిఎస్‌వో శ్రీధర్‌, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About amaravatinews

Check Also

ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌.. CBNతో అట్టా ఉంటది

బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్‌ గురించి తెలిసే ఉంటుంది. MNC కంపెనీల్లో ఉద్యోగులకు KRA అని ఒకటి ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *