తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రొడెక్ట్స్ లిమిటెడ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీకి నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే 15న నెయ్యి సప్లై కోసం ఆర్డర్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25 తేదీల్లో పాటు జులై 6న నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారన్నారు. గతంలో ఉన్న పాత విధానం ద్వారా ఆ నెయ్యిని టెస్టింగ్ చేసి వినియోగించారన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై వరుసగా ఫిర్యాదులు రావడంతో.. అనుమానంతో NDBL సహకారంతో అడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించామంది టీటీడీ. జులై 6, 12న ఏఆర్ డెయిరీ సరఫరా చేసి నాలుగు ట్యాంక్లర్ నెయ్యి టెస్టింగ్ కోసం పంపించామన్నారు. NDBL చేసిన పరీక్షల్లో.. లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టులు వచ్చాయన్నారు. దీంతో జులై 22, 23న, 27 తేదీల్లో ఏఆర్ డెయిరీకి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. కానీ ఏఆర్ డెయిరీ మాత్రం నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సెప్టెంబర్ 4న సమాధానం ఇచ్చిందన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal