తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ టోకెన్లు పెంచే ఆలోచనలో టీటీడీ..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నిత్యం కృషి చేస్తూ ఉంటుంది. అయితే రద్దీ వేళల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని తగ్గించేందుకు కూడా టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జీయంగార్లు, ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకే కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనం సమయం పెంచేందుకు జులై 22 నుంచి ఆఫ్‌లైన్‌లో రోజుకు వేయి శ్రీవాణి టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో జారీ చేస్తున్నట్లు వివరించారు. ఇక భక్తులు క్యూలైన్ల వేచి ఉండే సమయం తగ్గించేందుకు గతంలో వారానికి 1.05 లక్షల ఎస్‌ఎస్‌డి టోకెన్లు ఇచ్చేవారమన్న టీటీడీ ఈవో.. ప్రస్తుతం 1.59 లక్షల టోకెన్లు ఇస్తున్నట్లు చెప్పారు. వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు వివరించారు.

About amaravatinews

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *