తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అక్కడ కూడా దర్శన టికెట్లు, కౌంటర్ ఏర్పాటు

తిరుమల శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టైం స్లాట్ టోకెన్లు వారానికి 1.47 లక్షలు జారీ చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. అలిపిరి నుంచి విజిలెన్స్, అటవీశాఖ అధికారుల కొన్ని సూచనలు ఉన్నాయని.. త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చూస్తామన్నారు. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో.. టీటీడీ ఈవో జే శ్యామల రావు భక్తుల వద్ద నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు భక్తుల దగ్గర నుంచి ప్రశంసలు వచ్చాయి. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు పలు సూచనలు చేశారు. అలాగే శ్రీవాణి టికెట్స్ 1000కి పరిమితం చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

కొందరు భక్తులు గతంలో పోలిస్తే లడ్డూ ప్రసాదం నాణ్యత పెరిగిందని.. త్వరలో తిరుమలలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ ఈవో. సరిపడా క్వాలిటీ, క్వాంటిటీ నెయ్యి అందుబాటులో ఉన్నాయిని.. దీనిలో ఎలాంటి సమస్య లేదన్నారు. అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని.. కిచెన్ ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిపుణుల ద్వారా ఏర్పడిన కన్సెల్టెన్సీ ద్వారా కిచెన్ ఆధునీకరణకు అధ్యయనం చేస్తామన్నారు. ముడి సరుకు టెస్ట్ చేయడానికి ఓ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని.. ఇప్పటికే మొబైల్ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు.

తిరములలో దళారులకు చెక్ పెట్టెల యూఐడీఏఐ అధికారులతో చర్చలు నిర్వహించామని.. త్వరలోనే దళారులకు చెక్ పెడతామన్నారు టటీడీ ఈవో. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నిర్వాహకులకు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకోవాలన్నారు. తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ ప్రథమ ధ్యేయం అన్నారు. అలాగే నెయ్యి క్వాలిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుత్తణిలోని ఆరు ఎకరాల భూమి ఆక్రమణకు గురి అవుతున్నట్లు భక్తులు తెలిపగా.. వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈవో శ్యామలరావు.

తిరుమల నడక మార్గంలో చేపట్టాల్సిన చర్యలపై వైల్డ్ లైఫ్ కమిటీ మార్గనిర్దేశాలు పాటిస్తామన్నారు శ్యామలరావు. యూఐడీఏఐ సర్వర్ ఇష్యూ రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారని.. ఆధార్ సర్వీసులను వినియోగించడంలో ఎలాంటి చట్టపరమైన అవరోధాలు లేవన్నారు. జులై నెలలో శ్రీవారిని 22.13 లక్షలుమంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో తెలిపారు. జులైలో భక్తులు హుండీ సమర్పించిన కానుకలు రూ.125.35 కోట్లు కాగా.. జులై మాసంలో విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య: 1.04 కోట్లు.. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య : 24.04 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య: 8.67 లక్షలుగా ఉంది. 29 నెలలుగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు మార్క్ దాటేసింది.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *