తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో SGT టీచర్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు..

నవంబర్‌ 1: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ పాఠశాలలో ఎస్జీటీ గెస్ట్‌ ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన దరఖాస్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్మీనర్సమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన కింద మొత్తం 3 ఎస్జీటీ టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ ఇన్ హియరింగ్ ఇంపియర్డ్ (డీఈడీ, హెచ్‌ఐ) తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే టెట్‌లో అర్హత సాధించి ఉండాలని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హతలు, వయసు, నివాసం, కులం, ప్రావీణ్యానికి సంబంధించి ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సు సర్టిఫికెట్లను తీసుకుని నవంబరు 5వ తేదీలోపు వరంగల్ ఎన్ఐటీ సమీపంలోని టీటీడీ బధిరుల పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారికి నవంబర్‌ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలకు 9440739423 ఫోన్‌ నంబర్‌ ద్వారా పని వేళల్లో సంప్రదించవచ్చని పాఠశాల ప్రిన్సిపల్ కోరారు.

About amaravatinews

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *