తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. టీటీడీ మరోసారి వేలం నిర్వహించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలను ఆగస్టు 1న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో నైకాన్, కెనాన్, కొడాక్ తదితర కెమెరాలు ఉన్నాయి. ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించాలని టీటీడీ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఈ వేలంలో పాల్గొనాలని సూచించారు.
Check Also
ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్.. CBNతో అట్టా ఉంటది
బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్ గురించి తెలిసే ఉంటుంది. MNC కంపెనీల్లో ఉద్యోగులకు KRA అని ఒకటి ఉంటుంది. …