తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను నవంబరు 7వ తేదీన టెండర్, వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్ బియ్యం 13,880 కేజీలు టెండర్, వేలంలో ఉంచనున్నారు. ఆసక్తి గలవారు నవంబరు 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org సంప్రదించగలరు.
ఈనెల 31వ తేదిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమని శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఈవో కోరారు.
Amaravati News Navyandhra First Digital News Portal