కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో వైరల్ కావడం.. మంత్రి లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.. ఆయనపై చర్యలు తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ డ్రైవర్ సస్పెన్షన్ విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. డ్రైవర్ ఉద్యోగంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు.
డ్రైవర్‌ను సస్పెండ్ చేశారంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘అన్న మీరు ట్వీట్ చేయకముందే ఈ డ్రైవర్ ను సస్పెండ్ చేసేసారు అంట అన్న.. ప్లీజ్ ఒకసారి ఈ సంగేతంటో చూడండి.. క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యమే కానీ.. ఏదో సరదాగా, ఎవరికీ హాని చేయకుండా చేసిన మార్గం మాత్రం నేరం కాదు’ అన్నారు. ఈ ట్వీట్‌పై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. డ్రైవర్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూనే.. మరో బంపరాఫర్ కూడా ప్రకటించారు.
ఆయన (డ్రైవర్) సస్పెన్షన్ ఆర్డర్స్‌ను ఎత్తివేస్తారు.. ఆయన వెంటనే తన ఉద్యోగంలో చేరొచ్చు. నేను అమెరికా నుంచి రాగానే.. ఆయన్ను (డ్రైవర్) పర్సనల్‌గా కలుస్తాను’ అంటూ ట్వీట్ చేశారు మంత్రి లోకేష్. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మంత్రి లోకేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దమనసుతో స్పందించి ఆ డ్రైవర్‌కు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.