మార్కెట్ల లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని ఐపీఓలు మంచి లాభాల్ని అందిస్తుంటాయి. లిస్టింగ్‌తోనే భారీగా పెరుగుతుంటాయి. ఇటీవల మార్కెట్లు కరెక్షన్‌కు గురైన సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టాక్ ఫ్లాట్ లిస్టింగ్ అయినప్పటికీ.. తర్వాత వరుసగా 3 సెషన్లు 20 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో 79 వేల 500 మార్కు వద్ద ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 40 పాయింట్ల పతనంతో 24 వేల 300 మార్కు వద్ద ఉంది. అయితే మార్కెట్లు ఇలా ఒడుదొడుకుల్లో ఉన్నా కూడా ఎంట్రీ ఇచ్చిన ఐపీఓలు మంచి లాభాల్ని నమోదు చేశాయి.
యూనికామర్స్ ఐపీఓ..
ముందుగా యూనికామర్స్ ఇ- సొల్యూషన్స్ ఐపీఓ NSE లో 117.59 శాతం ప్రీమియంతో రూ. 235 వద్ద లిస్టయింది. దీని ఇష్యూ ప్రైస్ రూ. 108 మాత్రమే కావడం గమనార్హం. అంటే లిస్టింగ్‌తోనే డబుల్ ప్రాఫిట్ ఇచ్చింది. రూ. 235 తోనే ఆగలేదు మళ్లీ అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 256.15 వద్ద ఆల్ టైమ్ హైని తాకింది. దీంతో తొలిరోజే 140 శాతం వరకు పుంజుకుంది.
ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూస్తే ఈ ఐపీఓలో కనీసం 138 షేర్లు కొనుగోలు చేయాలి. ఇష్యూ ధర రూ. 108 లెక్కన దీని కోసం పెట్టుబడి రూ. 138X108= 14,904 కావాలి. ఇక ఇది గరిష్ట ధర అయిన రూ. 256.15 తో చూస్తే రూ. 35,348 గా మారింది. అంటే లాట్‌పై రూ. 21 వేలకుపైగా లాభం వచ్చింది. లిస్టింగ్ ప్రైస్‌తో చూస్తే దాదాపు రూ. 18 వేలకుపైగా లాభం పొందారు ఇన్వెస్టర్లు. ఆగస్ట్ 6-8 మధ్య ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జరగ్గా.. మంచి స్పందన లభించింది. మొత్తం 1.4 కోట్ల షేర్లు అందుబాటులో ఉంటే.. ఏకంగా 237.11 కోట్ల షేర్లకు బిడ్స్ వేయడం గమనార్హం.
ఫస్ట్‌క్రై ఐపీఓ ప్రైస్..
మరోవైపు బ్రెయిన్‌బెస్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఫస్ట్‌క్రై) ఐపీఓ కూడా మంచి లాభం నమోదు చేసింది. ఇష్యూ ధర రూ. 465 కాగా.. 40 శాతం ప్రీమియంతో రూ. 651 వద్ద ఓపెన్ అయింది. తర్వాత 10 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 707.70 వద్ద గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 45 శాతానికిపైగా లాభంతో రూ. 675 వద్ద ట్రేడవుతోంది. ఒక్కో షేరుపై తొలిరోజే రూ. 200 కు పైగా పెరిగిందని చెప్పొచ్చు. గ్రే మార్కెట్లో రూ. 84 గానే ప్రీమియం ఉండగా.. అంతకుమించి నమోదు కావడం విశేషం.