కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అరెస్ట్.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం..!

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్‌లోని అటు అశోక్ నగర్‌లో, ఇటు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్రం మంత్రి బండి సంజయ్ కూడా గ్రూప్-1 అభ్యర్థులకు అండగా నిలిచారు. అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలో బండి సంజయ్ పాల్గొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వెంటనే రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ.. చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు బండి సంజయ్.

ఈ క్రమంలోనే.. మోహన్‌నగర్‌లోని గ్రూప్-1 అభ్యర్థులను బండి సంజయ్ పరామర్శించారు. భారీ ఎత్తున చేరుకున్న విద్యార్థులతో చలో సెక్రటేరియట్‌కు యువతతో కలిసి బండి సంజయ్ బయలుదేరగా.. అప్రమత్తమైన పోలీసులు బండి సంజయ్ కారును అడ్డుకున్నారు. సంజయ్ ర్యాలీని ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. దీంతో.. పోలీసుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా సచివాలయం వెళ్లి తీరుతానని బండి సంజయ్ పోలీసులకు సవాల్ విసిరారు. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థులంతా ఏకమై “పోలీసులు గో‌‌బ్యాక్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

About amaravatinews

Check Also

అయ్యా..! యూరియా అంటే పట్టించుకోవట్లే.. కట్ చేస్తే ఇది సీన్..

వర్షాలు విస్తారంగా పడటంతో పంటలకు యూరియా డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా సరిగ్గా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *