గుడ్‌మార్నింగ్‌ కాదు జై హింద్.. ఆగస్టు 15 నుంచి పాఠశాలల్లో మార్పు

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో కొత్త నిబంధనను తీసుకువచ్చింది. పాఠశాలల్లో గుడ్ మార్నింగ్‌కు బదులు జై హింద్ అని వాడాలని హర్యానా పాఠశాల విద్యా శాఖ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 వ తేదీన దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్యానాలో అధికారంలో ఉన్న నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, దేశ ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

హర్యానాలోని పాఠశాల విద్యా డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని.. హర్యానా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా గుడ్‌ మార్నింగ్‌కు బదులుగా జై హింద్‌ అని చెప్పాలని పాఠశాల విద్యా డైరెక్టరేట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశంపై ప్రేమ, గౌరవం, పెంచాలనే ఆలోచనతోనే ఈ సరికొత్త నిబంధన తీసుకువచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేసే ముందు నుంచి ఈ కొత్త నిబంధనను అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

About amaravatinews

Check Also

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను నియమాలు ఏంటి?

పన్ను శాఖ మీ ఇంట్లో నగదును కనుగొంటే, దాని మూలాన్ని వెల్లడించలేకపోతే అప్పుడు భారీ జరిమానా లేదా చట్టపరమైన చర్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *