వాడిన టీ పౌడర్‌తో ఇలా చేస్తే మోచేతులు, అండర్‌ ఆర్మ్స్‌పై నలుపుదనం తగ్గుతుంది

టీ పొడితో మనం టీని తయారు చేయడం మాత్రమే.. మీ అందాన్ని కూడా పెంచుకోవచ్చు. టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది. అంతేకాదు, చర్మంపరై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది. దీనికోసం టీ పొడిని ఎలా వాడాలో తెలుసుకోండి.

ఇందుకోసం తాజా టీ పొడి అవసరం లేదు. వాడిన టీ పౌడర్‌ని కూడా వాడొచ్చు. దీనిని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి.

ఎలా వాడాలి..

దీనిని వాడడం వల్ల పెద్ద రంధ్రాలు తగ్గి ముడతలు, ఫైన్‌లైన్స్ తగ్గుతాయి. దీని వల్ల వృద్ధాప్య లక్షణాలు దూరమై యవ్వనంగా కనిపిస్తారు. మీ చర్మంపై రంధ్రాలు ఉంటే ఓ చెంచా అలోవెరా జెల్ వేసి ఓ చెంచా టీని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత మసాజ్ చేసి క్లీన్ చేయండి.

ప్రతి రోజూ టీ చేశాక ఆ టీ పౌడర్‌ని పారేయొద్దు.. దీనిని చల్లార్చి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. దీనిని స్నానం చేసేటప్పుడు సబ్బు, బాడీ వాష్ వాడే ముందు ఈ టీ పౌడర్‌ని ప్రతిరోజూ అప్లై చేసి స్క్రబ్‌లా రాయాలి. ఆ తర్వాత సబ్బుతో క్లీన్ చేయాలి.

ఇలా చేయడం ద్వారా, డబుల్ క్లెన్సింగ్‌తో శరీరం పూర్తిగా క్లీన్ అవుతుంది. దీంతో చనిపోయిన చర్మ కణాలు కూడా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. చర్మం మెరుస్తుంది. రక్తప్రసరణ కూడా పెరుగుతుంది.

పాదాల పగుళ్ళు వస్తే పాదాల అందం పాడవుతుంది. కొంతమందికి ఈ సమస్య ఎక్కువవుతుంది. అలాంటి సమస్యని దూరం చేసి పాదాలను మృదువుగా చేసేందుకు టీ పొడిని ఎలా వాడాలంటే..

ఓట్స్..

ముందుగా ఓ చెంచా ఓట్స్ తీసుకుని పొడిలా చేయాలి. తర్వాత టీ పొడి, కొబ్బరినూనె, కొద్దిగా నిమ్మరసం వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని పగిలిన పాదాలపై రాయాలి. తర్వాత మెత్తని స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేయాలి. దీనివల్ల పాదాలు మృదువుగా మారతాయి.

కొందరికి మోచేతులు, అండర్ ఆర్మ్స్‌పై నలుపుదనం ఎక్కువగా ఉంటుంది. దీనిని దూరం చేసేందుకు టీ పౌడర్‌ని వాడొచ్చు.

ఎలా వాడాలంటే..

టీ పౌడర్‌లో కొద్దిగా అలొవెరా జెల్, రోజ్‌వాటర్ వేసి మిక్స్ చేయండి. తర్వాత నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్ళు, అండర్ ఆర్మ్స్‌పై రాయాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత మెల్లిగా స్క్రబ్ చేసి చల్లని నీటితో క్లీన్ చేయాలి.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

About amaravatinews

Check Also

చపాతీలను ఇలా తింటే బరువు తగ్గుతారు

బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నిస్తుంటారు. నిజానికీ బరువు తగ్గించడంలో మనం తీసుకునే ఆహారం కీ రోల్ పోషిస్తుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *