Vizag: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి. కానీ మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం ఉండదు. కనీసం రోడ్లు కూడా లేక చెట్లు, కొండలు, గుట్టలు దాటుకుంటూ అక్కడి ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక వర్షాలు, చలికాలం.. ఇలాంటి సమయాల్లో వారి బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే.. వాళ్లు అక్కడి నుంచి బయట పడాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే. ఇక అనారోగ్యం బారిన పడినవారు, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలు, చావుబతుకుల్లో ఉన్న వారిని ఏజెన్సీ ప్రాంతాల నుంచి దగ్గర్లో ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కు. అంబులెన్స్‌లు గానీ, ఇతర వాహనాలు గానీ అక్కడికి వెళ్లే పరిస్థితులు ఉండవు. ఇక అలాంటి సమయాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే అలాంటి ఏజెన్సీ ప్రాంతవాసులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గుడ్‌న్యూస్ చెప్పారు.
విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజల కష్టాలను హోం మంత్రి వంగలపూడి అనిత గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడితే రహదారులు సరిగా లేక అక్కడికి అంబులెన్స్ రాని పరిస్థితుల్లో గత్యంతరం లేక స్థానికులు డోలీనే నమ్ముకుంటున్నారని గుర్తించారు. అలాంటి సమయాల్లో కొన్నిసార్లు ప్రమాదం నుంచి బయటపడినా.. మరికొన్నిసార్లు మాత్రం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ కష్టాలు, ఇబ్బందులపై హోంమంత్రి దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా గురువారం విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన హెూం మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు.