విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో కె.ఎస్ రామారావు కీలకమైన సూచన చేశారు. దుర్గమ్మకు నివేదన సమర్పించే సమయంలో.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉంటున్నారు. అందుకే ఆ సమయంలో ప్రముఖుల ప్రోటోకాల్ దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. అంతేకాదు శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఇతర రోజుల కంటే ఎక్కువగా ఉంటోంది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రముఖుల ప్రోటోకాల్ దర్శనాలకు వీలు ఉండదు.. మిగతా వేళల్లో అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దుర్గగుడి అభివృద్ధి పనుల కారణంగా.. కనకదుర్గా నగర్‌లో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఘాట్ రోడ్డులో పరిమితంగానే వాహనాలను నిలిపేందుకు వీలుంటుంది అన్నారు.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 లోపు.. మరోవైపు వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అధికారులు రావొద్దని గతంలోనే ఈవో రామారావు విజ్ఞప్తి చేశారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో మినహా మిగతా వేళల్లోనే అమ్మవారి దర్శనానికి రావాలని.. అలాగే ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మహా నైవేద్యం జరుగుతుంది అన్నారు. భక్తుల ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Amaravati News Navyandhra First Digital News Portal